ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కలిసివస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. అయితే భూముల కొనుగోలు, వాహనం విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. కళాకారులకు మంచి సమయం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టడానికి ఇది అంత అనుకూల సమయం కాదు. చేతిలో ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించండి. ఉద్యోగులకు మిశ్రమ సమయం. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు రావొచ్చు. వాహన మరమ్మతులు ముందుకురావొచ్చు. ప్రభుత్వ, రాజకీయ పనుల్లో ఊరట లభిస్తుంది. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబపెద్దల సహకారం అందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అతికష్టం మీద పనులు నెరవేరుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. ప్రభుత్వ, కోర్టు వ్యవహారాల్లో కాలయాపన జరుగుతుంది. వారాంతంలో అదృష్టం కలిసివస్తుంది. అధికారులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ప్రారంభించిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆర్థికాంశాల్లో పెద్దల సలహాలు పాటించడం అవసరం. కళాకారులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదృష్టం కలిసివస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఉత్సాహంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కార్యసిద్ధి ఉంది. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సమయం. చిన్న ప్రయత్నంతో పెద్ద ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు పనుల్లో కదలిక ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులున్నా.. సమయానికి డబ్బు అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. మీ పనులను ఇతరులకు అప్పగించకండి. ఉద్యోగులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం అవసరం. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. గృహ నిర్మాణంపై మనసు నిలుపుతారు. శివారాధన మేలు చేస్తుంది.
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరగకుండా చూసుకోవాలి. సోదరులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. వ్యాపారులకు మంచి సమయం. పాతబాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
ఆర్థిక విషయాల్లో అస్పష్టత వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూమి కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కళాకారులకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సహోద్యోగులతో కలివిడిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శారీరకంగా అలసటకు గురవుతారు. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు ఉండవచ్చు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కలుగుతుంది. శివాలయాన్ని సందర్శించండి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల సహకారంతో పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని పక్కాగా అమలు చేయడంలో విజయవంతం అవుతారు. పలుకుబడి పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విహార యాత్రలు చేపడతారు. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.