వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సహోద్యోగులతో సమస్యలు రావచ్చు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. వాహనం, భూమి కొనుగోలు వ్యవహారాలు కలిసివస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెద్దల నుంచి విలువైన సలహాలు అందుకుంటారు. వ్యాపారం అనుకూలంగా సాగుతుంది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు కేసుల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం గ్రహస్థితి అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమతో పనులు పూర్తవుతాయి. పట్టుదల అవసరం. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. సహోద్యోగులు, అధికారులతో మాటపట్టింపులు రావచ్చు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉన్నా.. వివాదాలు తలెత్తవచ్చు. వారాంతంలో శుభవార్త వింటారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ప్రారంభించిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సమయానికి డబ్బు అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని విషయాల్లో నిరుత్సాహం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కళాకారులకు అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. బంధుమిత్రుల విషయంలో సంయమనం పాటించండి. సూర్యారాధన మేలు చేస్తుంది.
ఉద్యోగ ప్రయత్నాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. తీర్థయాత్రలు చేపట్టే అవకాశం ఉంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాప్యం. వారాంతంలో కార్యసిద్ధి ఉంది. పెద్దల సహకారం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యవసాయదారులు సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. రామాలయాన్ని సందర్శిస్తే మేలు కలుగుతుంది.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. సమయానికి సాయం చేసేవారు ఉంటారు. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పలుకు బడితో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
రావలసిన డబ్బు అందుతుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరిగినా.. ఫలితం దక్కుతుంది. తీర్థయాత్రలు చేపడతారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సమస్యలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. అధికారుల జోక్యంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శిస్తే మేలు కలుగుతుంది.
ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల వల్ల కార్యసాఫల్యం ఉంది. పదోన్నతితో స్థానచలన సూచన. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులలో సానుకూలత ఉంటుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. వాహనం కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాల వల్ల లబ్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ.. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఇంటి వాతావరణం అనుకూలం. సత్ఫలితాలను పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. శ్రమతో కూడిన ఫలితాలు అందుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్య యత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. శివారాధన వల్ల మేలు కలుగుతుంది.
అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. భూ లావాదేవీల్లో లాభాలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నలుగురికీ సాయపడతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in