ఖైరతాబాద్, సెప్టెంబర్ 26: దేశంలో 75 ఏండ్లుగా ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ‘ది వైర్’ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మా ట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ప్రజల సమ్మతి లేకుం డా కొత్త చట్టాలు, విధానాలను రుద్దే ప్ర యత్నం జరుగుతున్నదని విమర్శించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నదని కీలకమైన హకులను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ పేరిట ప్రజా ఓటు హకును తొలగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకు మాత్రమే పరిమితమైందని వరదరాజన్ గుర్తుచేశారు. భవిష్యత్తులో సీట్ల సంఖ్య మరింత తగ్గవచ్చుననే భయంతోనే ‘సర్’ ద్వారా ఓటర్ల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అనుమానం వ్యక్తంచేశారు. అక్టోబర్ 2న సీజేపీ ఆధ్వర్యంలో జరిగే రెండోదశ జెన్‌జీ ఉద్యమానికి సంపూ ర్ణ మద్దతునిస్తున్నామని, అందులో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేఎన్‌యూ మాజీ అధ్యక్షురాలు అయిషీ ఘోష్, ది వైర్ ఎడిటర్ కొండూరి వీరయ్య, కోఎడిటర్ ఐవీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.