పనులు వేగవంతంగా పూర్తవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. కాలం అనుకూలంగా ఉంది. కష్టపడితే తగిన ప్రతిఫలం ఉంటుంది. రాబడి పెంచుకునే మార్గాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రుల వల్ల పనులు నెరవేరుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య అవకాశం రావచ్చు. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. శ్రమ పెరిగినప్పటికీ.. ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగులకు మంచి సమయం. బంధుమిత్రులతో కార్యసాఫల్యం ఉంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. అన్నదమ్ములతో సంతోషంగా కాలం గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆదరణ పెరుగుతుంది. రావలసిన సొమ్ము పాక్షికంగా చేతికి అందుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తితో పనులు చక్కబెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రుల రాకతో సంతోషంగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే, అనవసరమైన చర్చల ద్వారా మానసిక అశాంతికి గురవుతారు. వ్యాపారులకు మంచి సమయం. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టిపెట్టండి. వ్యాపార విస్తరణ కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి.
పదోన్నతి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన వారం. ప్రయాణాలు కలిసివస్తాయి.
తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ, వారాంతంలో పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ప్రభుత్వ, రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గంతో విభేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం సాధిస్తారు. విదేశీ విద్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాబడి పెరుగుతుంది.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. బంధువర్గంతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. పని భారం పెరిగినా.. చాకచక్యంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. వ్యాపారులకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆర్థిక సమస్యలతో ఆలస్యంగా పూర్తికావచ్చు. రాబడికి మించి ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులు పూర్తిచేయడంలో జాప్యం జరగవచ్చు. నూతన ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లడం అవసరం. బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సంతోషంగా ఉంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. బంధువర్గం సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. నూతన వాహనం, భూమి కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి సమయం. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికస్థితి గతంలో కన్నా మెరుగవుతుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి.
ప్రయాణాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పూర్వం తలపెట్టిన పనుల్లో కదలిక వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన వారం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. అలసట దరి చేరనీయరు. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టులో అనుకూల ఫలితాలు సాధిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
ఆదాయం స్థిరం. అధికారులతో స్నేహంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. భక్తి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అనవసరమైన చర్చలతో కాలయాపన జరుగుతుంది. వివాదాల మూలంగా మనశ్శాంతి కోల్పోతారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. గత పెట్టుబడుల వల్ల రాబడి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వారం. ఉత్పాదకత పెరుగుతుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి స్థాయిలో నిలుస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది.