తలపెట్టిన కార్యాలు అనుకూలంగా పూర్తవుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధువులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. అనుకోని ఖర్చులు ముందుకువస్తాయి. రోజువారీ వ్యాపారం నిర్విఘ్నంగా సాగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో గడువులోపు పనులు చక్కబెడతారు. భూ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
ఈ వారం అనుకూలంగా ఉంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ఆత్మీయులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీల్లో అదృష్టం కలిసివస్తుంది. ఇంటా, బయటా మంచి వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన వారం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అందరి సహకారం లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. వారాంతంలో శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారుల ఆదాయం పెరుగుతుంది. శివారాధన శుభప్రదం.
రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. సహోద్యోగులతో స్నేహభావం అవసరం. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త ఆలోచనలు అమలుచేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆంజనేయస్వామి ఆరాధనతో మేలు కలుగుతుంది.
భూముల వ్యవహారం కలిసివస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. రాజకీయ కార్య సాఫల్యం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకుంటే మంచిది. కొత్త పరిచయాలతో పనులు పూర్తవుతాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పదోన్నతి అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.
వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. విందులూ వినోదాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసాఫల్యం ఉంది. అదృష్టం కలిసివస్తుంది. ఆత్మీయులతో వాగ్వాదాలు వద్దు. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.ఉత్సాహంతో పనులు చేస్తారు. దుర్గాదేవి ఆరాధనతో మేలు కలుగుతుంది.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు కలిసివస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగులకు మంచి సమయం. కార్యసాధనపై మనసు నిలుపుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యారాధన శుభప్రదం.
అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ప్రయత్నాలు ఫలించి, కొత్త ఉద్యోగంలో చేరతారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో సానుకూల తీర్పు వెలువడుతుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించండి.
ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి సమయం. రాబడి పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఖర్చుల నియంత్రణ తప్పనిసరి. కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. నలుగురికి సాయపడతారు. ఆత్మీయులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారాంతంలో అదృష్టం కలిసివస్తుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.