వృత్తిపరంగా సంతోషంగా ఉంటారు. ఒత్తిళ్లున్నా సకాలంలో పనులు నెరవేరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేర్చుకుంటారు. వ్యాపార ఒప్పందాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి.
పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల్లో కదలిక వస్తుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచన. ఉద్యోగ మార్పు ఉండవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. పారిశ్రామికవేత్తల రాబడి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల వారం.
వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. శ్రమ పెరిగినప్పటికీ, దానికి తగ్గ ఫలితం పొందుతారు. బంధువుల సహకారంతో శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కోర్టు పనుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పట్టుదలతో ప్రయత్నిస్తే కార్యసిద్ధి ఉంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూలత ఉంది. వాహనాల మూలంగా ఖర్చు పెరగవచ్చు.
ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. భూముల వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రభుత్వ, రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్వయం ఉపాధిలో ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది. రాబడి సంతృప్తినిస్తుంది.
నిర్మాణాత్మక కార్యాలు చేపడతారు. అన్నదమ్ములు, బంధువర్గంతో కార్యసాఫల్యం ఉంది. పనిలో ఏకాగ్రతను కనబరుస్తారు. సమాజంలో ఉన్నతస్థితిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. వ్యవసాయదారుల ఆదాయం పెరుగుతుంది. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యుల సూచనలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచన. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి.
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే, జాగ్రత్త అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. పూర్వం నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగంలో స్థానచలన అవకాశం. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. స్థిర, చరాస్తుల వల్ల రాబడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో విజయం వరిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.
ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వస్తువుల కొనుగోలులో ఆలస్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులు పూర్తిచేయడంలో పట్టుదల కనబరుస్తారు. బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలను చేపడతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలతో లబ్ధి పొందుతారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త పాటించడం అవసరం. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.