తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులు, ఆత్మీయులతో చేసే పనులు కలిసివస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. అభీష్టాలను నెరవేర్చుకుంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అవసరం.
ఆహార నియమాలను పాటించడం అవసరం. ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ తగదు.
పనులలో అదృష్టం కలిసివస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పాతబాకీలు కొంతవరకు వసూలు అవుతాయి. నూతన ఉద్యోగంలో చేరవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. గతంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయం ఏర్పడవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం సజావుగా సాగుతుంది. సోదరులు, స్నేహితులతో కొన్ని పనులు నెరవేరుతాయి. రాబడికి తగ్గ ఖర్చులూ ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించడం కన్నా.. చేతిలో ఉన్నవాటిని పూర్తిచేయడంపై దృష్టి సారించండి.
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. అదృష్టం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామిక
వేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సమయం ప్రోత్సాహకరంగా ఉంది. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీదే. సేవాభావంతో పనులు చేస్తారు.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. పట్టుదలతో పనులు చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు.
ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, ప్రభుత్వ పనులలో వృథా ఖర్చులు ఉంటాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వాహనం కొంటారు. కుటుంబంలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కొన్ని సర్దుబాట్లు అవసరం పడతాయి.
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. పై చదువులకు ఈ వారం అనుకూలం. ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహిస్తారు. నియమాలకు లోబడి పనులు చేస్తారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పెద్దల సలహాలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులు, ఆత్మీయుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయాన్ని వృథా చేయకుండా పనులపై మనసు నిలుపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు పనులలో జాప్యం జరగవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదల, విశ్వాసంతో పనులు చేస్తారు. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గృహ నిర్మాణం దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. పరిచయాల ద్వారా కార్య సాఫల్యం ఉంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు ఈ వారం ఊహించని అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అధికారుల ఆదరణ కోసం ప్రయత్నిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం అవసరం. ఉత్సాహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. స్థిరాస్తి ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. సోదరులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. సమయపాలన అవసరం. రియల్ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్లకు ఆర్థికంగా కలిసివస్తుంది. మొత్తంగా ఈ వారం సంతృప్తికరంగా సాగుతుంది.
కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అధికారులతో స్నేహం పెంపొందించుకుంటారు. సమయానికి తగ్గటు నిర్ణయాలను తీసుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.