బంకురా(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్లోని బంకురా ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో శుక్రవారం(అక్టోబర్ 2) మధ్యాహ్నం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నీలాద్రి శేఖర్ దానాను కలసిన సందర్భంగా వారికి ఘోర అవమానం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చెందిన మహిళల కోసం ఉద్దేశించిన అన్నపూర్ణ యోజన పథకం కింద సాయం అందించాలని కోరారు.
సాయం చేయడానికి బదులుగా జై శ్రీరామ్ నినాదాన్ని పలకాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అన్నపూర్ణ పథకం మొదట హిందూ మహిళలకు, ఆ తర్వాతే ముస్లిం కుటుంబాలకు అందుతాయని ఎమ్మెల్యే తేల్చిచెప్పారని ముస్లిం మహిళలు తెలిపారు. ఎమ్మెల్యే మాటలతో ఇంటికి వచ్చిన తర్వాత అన్నం కూడా తినలేకపోయాము అని సబీనా మోండర్ అనే మహిళ వాపోయారు.