Numerology | ఎక్కడికి వెళ్లినా ఈ అమ్మాయిలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.. కారణమిదే!
Numerology | ఏ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది? వారి ఆలోచనలు ఎలా ఉంటాయనేది పుట్టిన తేదీ ప్రకారం తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం ద్వారా వ్యక్తి స్వభావంలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు అంచనా వేయొచ్చని అంటున్నారు.
Numerology | కొంతమంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు. అందరూ తమనే చూడాలని ఆశపడుతారు. మరికొందరు మాత్రం ప్రశాంతంగా, వివాదాలకు దూరంగా తమ జీవితాన్ని గడపాలని ఆధారపడతారు. అయితే ఏ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది? వారి ఆలోచనలు ఎలా ఉంటాయనేది పుట్టిన తేదీ ప్రకారం తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం ద్వారా వ్యక్తి స్వభావంలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు అంచనా వేయొచ్చని అంటున్నారు.
అందరి దృష్టి తమపై ఉండాలని అనుకునేది వీళ్లే..!
మూలాంకం 3
ఏ నెలలో అయినా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి చెందిన అమ్మాయిలు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడంలో ముందుంటారు. ఎక్కడ ఉన్నా తమను అందరూ గుర్తించేలా ప్రవర్తిస్తుంటారు. స్నేహితులు, ఫ్యామిలీ గెట్ టు గెదర్ ఇలా ఏదైనా సరే అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని తహతహలాడుతారు. అందరూ గుర్తించి, పొగుడుతుంటూ వీళ్లు చాలా సంబరపడిపోతారు
మూలాంకం 5
సాధారణంగా 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5గా ఉంటుంది. వీరికి ఉత్సాహభరితమైన జీవితం అంటే చాలా ఇష్టం. కొత్త విషయాలను తెలుసుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, సాహసోపేత అనుభవాలను ఆస్వాదించడం వీరి లక్షణాలు. ఒకేరకమైన దినచర్య వీరికి తొందరగా విసుగు తెప్పిస్తుంది. అందుకే సమాజంలో చురుగ్గా ఉండటం కొత్త అనుభవాల కోసం ప్రయత్నించడం వీరికి అలవాటుగా ఉంటుంది.
మూలాంకం 1
సాధారణంగా 1, 10, 19, 28వ తేదీల్లో పుట్టిన వారిది 1వ మూలాంకం, వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటారు. ఇతరులను ప్రభావితం చేయడం వీరి ప్రత్యేకత. ఎక్కడైనా గుర్తింపు దక్కాలని.. తమకు ప్రత్యేక స్థానం పొందాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. అయితే మూలాంకం 3 లేదా 5 వారిలా సామాజిక అటెన్షన్ కోసం కాకుండా తమ వ్యక్తిత్వం, ప్రతిభ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని కోరుకుంటారు.
ప్రశాంతతను కోరుకునే మూలాంకాలు
మూలాంకం 2
సాధారణంగా 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు సాధారణంగా మృదుస్వభావం కలిగి ఉంటారు. అనవసర వాదనలు, గొడవలు, ఉద్రిక్త పరిస్థితులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ, అనుబంధం, భావోద్వేగ భద్రత వీరికి చాలా ముఖ్యమైనవి, కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య సమతుల్యతను కాపాడుకునేందుకు కృషి చేస్తారు.
మూలాంకం 6
సాధారణంగా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. కుటుంబ సౌఖ్యం, ఆనందం, భావోద్వేగ సమతులత్య వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందమైన వాతావరణం, సంతోషకరమైన సంబంధాలు, ప్రశాంత జీవితం వీరికి అత్యంత ప్రాధాన్యం. డబ్బు, పేరు ప్రఖ్యాతల కంటే మనశ్శాంతినే ఎక్కువ విలువైనదిగా భావిస్తారు.
మూలాంకం 9
సాధారణంగా 9, 18, 27వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 9గా పరిగణిస్తారు. వీరు బాహ్య ఆడంబరాల కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇతరుల బాధలను అర్థం చేసుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. దయ, సహానుభూతి, పరిపక్వత కూడా ఉంటాయి. వీరు నిజాయితీతో కూడా అనుబంధాలు ఎక్కువగా కోరుకుంటారు.
అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం మూలాంకం వ్యక్తి స్వభావంలో కనిపించే కొన్ని ధోరణులు మాత్రమే సూచిస్తుంది. కుటుంబ పరిస్థితులు, పెంపకం, విద్య, జీవిత అనుభావాలు కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మూలాంకం ఆధారంగా చెప్పే అంశాలను ఒక సాధారణ అంచనాగా మాత్రమే పరిగణించాలని న్యూమరాలజీ నిపుణులు సూచిస్తున్నారు.
Read More:
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారట.. ఎందుకో తెలుసా?
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

