Shani Transit | ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడబోతున్నది. ఉగాది పండుగకు ముందు రోజున ఈ గ్రహణం ఆవిష్కృతం కానున్నది. అయితే, గ్రహణం కారణంతో పాటు శనిగ్రహం స్థానచలనం కారణంగా రెండు రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. ఆ రాశులు మేష, కుంభరాశులని తెలిపారు.
శనగ్రహ సంచారం కారణంగా మేషరాశి వారికి గ్రహణం కారణంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశివానికి శని సాడేసతి కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఉన్నది. ఏ పని చేపట్టినా కార్యరూపం దాల్చకుండా పెండింగ్లో పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బందులుపడే సూచనలుంటాయని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు.
శనైశ్చరుడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దాంతో కుంభరాశిపై అశుభ దృష్టి పడుతుందని.. దాంతో పాటు గ్రహణం సైతం ప్రభావం చూపుతుందని పండితులు పేర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నారు.
శనైశ్చరుడు అశుభ దృష్టితో చూస్తే కెరియర్లో గ్రోత్ ఉండదు. ఏ పని చేసినా అందులో విజయం సాధించలేకపోతుంటారు. అప్పుల ఊభిలో చిక్కుకుపోతారు. కార్యాలయాలతో పాటు కుటుంబీకులతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టాలని. శనివారం శని చాలీసా పఠించాలి. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. అలాగే, మంగళవారం రోజుల్లో ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఉత్తమం. వీలైతే హనుమాన్ చాలీసా పఠించాలి.