Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుంటే కాపురం కంటే గొడవలే ఎక్కువ!
Numerology | వివాహ బంధంపై పుట్టిన తేదీ కూడా ప్రభావం చూపిస్తుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే వారి మధ్య నిత్యం ఏదో గొడవ తప్పదని.. వాళ్లు కలిసి ఉండలేరని అంటున్నారు.
Numerology | వివాహ బంధం అనేది ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. పెళ్లిచేసుకున్న అమ్మాయి, అబ్బాయి మధ్య ఆలోచనా విధానం, స్వభావం, లైఫ్‌స్టైల్ భిన్నంగా ఉంటే వాళ్ల మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి విషయాల్లో పుట్టిన తేదీ కూడా ప్రభావం చూపిస్తుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు పెళ్లి చేసుకుంటే వారి మధ్య నిత్యం ఏదో గొడవ తప్పదని.. వాళ్లు కలిసి ఉండలేరని అంటున్నారు.
సంఖ్యా శాస్త్రంలో 1 నుంచి 9 వరకు ప్తరి మూలాంకానికి ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. కొన్ని మూలాంకాల కలయిక ఉన్న జంటలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటే.. మరికొన్ని మూలాంకాల జంటలు ఎప్పుడూ గొడవలతో పూర్తి విరుద్ధంగా ఉంటారు. మరి అలాంటి మూలకాలేంటో ఇప్పుడు చూద్దాం..
మూలాంకాలు 1-8
సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 10, 19, 28వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 1గా పరిగణిస్తారు. అలాగే 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా భావిస్తున్నారు. మూలాంకం 1 ఉన్న వారికి సూర్యుడు అధిపతి కాగా, 8 మూలాంకం వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మూలాంకం 1 ఉన్న వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. తమకు నచ్చినట్లుగానే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. మరోవైపు 8 మూలాంకం ఉన్న వారు క్రమశిక్షణ, సహనం కలిగి ఉన్నప్పటికీ ఆచరణాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ ఈ రెండు మూలాంకాల వ్యక్తులు దంపతులైతే ఎవరి మాట నెగ్గాలి అనే విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మూలాంకాలు 2-9
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 2. ఈ సంఖ్యపై చంద్రుని ప్రభావం ఉంటుంది. 9, 18, 27వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 9గా పరిగణిస్తారు. దీనిపై కుజుడి ప్రభావం ఉంటుంది.
మూలాంకం 2 ఉన్న వారు భావోద్వేగపరులు, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక మూలాంకం 9 ఉన్నవారు ముక్కుసూటిగా మాట్లాడే, దూకుడు స్వభావం, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. దీంతో ఒకరు భావోద్వేగాలను ఎక్కువగా పట్టించుకుంటే.. మరొకరు స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అభిప్రాయభేదాలు రావచ్చని న్యూమరాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మూలాంకాలు 4-5
సంఖ్యాశాస్త్రం ప్రకారం 4, 13, 22, 31వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4గా పరిగణిస్తారు. దీనిపై రాహువు ప్రభావం ఉంటుంది. 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5. దీనిపై బుధుడి ప్రభావం ఉంటుంది.
మూలాంకం 4 ఉన్నవారు క్రమబద్ధమైన జీవనశైలిని ఇష్టపడతారు. నియమ నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తారు. మరోవైపు మూలాంకం 5 ఉన్నవారు స్వేచ్ఛ, మార్పులు, కొత్త అనుభవాలను ఇష్టపడతారు. ఇలా భిన్న లైఫ్‌స్టైల్ కారణంగా ఈ జంటల మధ్య తరచూ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
మూలాంకం 7-8
సంఖ్యా శాస్త్రం ప్రకారం 7, 16, 25వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 7. ఈ సంఖ్యకు చెందిన వారు ఆధ్యాత్మిక ఆలోచనలు, లోతైన విశ్లేషణాత్మక దృక్పథం కలిగి ఉంటారు. అదే మూలాంకం 8 ఉన్న వారు ఫలితాలపై దృష్టిపెట్టే ప్రాక్టికల్ వ్యక్తులు. ఒకరు ఇంట్రోవర్ట్ అయితే.. మరొకరు జీవితాన్ని వాస్తవిక కోణంలో చూసేవారు. ఈ కారణంగా ఇద్దరి ప్రాధాన్యతలు భిన్నంగా ఉండి, భావోద్వేగ దూరం పెరిగే అవకాశం ఉంటుంది.
మూలాంకం 3-6
సంఖ్యాశాస్త్రం ప్రకారం 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3. దీనిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6. దీనిపై శుక్రుడి ప్రభావం ఉంటుంది.
మూలాంకం 3 ఉన్నవారు ఆశయాలు, లక్ష్యాలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. మూలాంకం 6 ఉన్నవారు కుటుంబం, సౌకర్యాలు, సంబంధాలకు ఎక్కువ విలువనిస్తారు. ఇద్దరి జీవిత ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Read More:
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

