Numerology | మీది లవ్ మ్యారేజీనా.. అరెంజ్ మ్యారేజీనా.. పుట్టిన తేదీని బట్టి ఇలా తెలుసుకోవచ్చట!
Numerology | తమకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా? అరెంజ్డ్ మ్యారేజ్ చేుకోవాల్సి వస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ, దాని మూలాంకాన్ని బట్టి అతని వ్యక్తిత్వంతో పాటు భవిష్యత్తుకు సంంబంధించిన చాలా విషయాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Numerology | ప్రేమ, పెళ్లి, జీవిత భాగస్వామి వంటి అంశాలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. తమకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా? అరెంజ్డ్ మ్యారేజ్ చేుకోవాల్సి వస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ, దాని మూలాంకాన్ని బట్టి అతని వ్యక్తిత్వంతో పాటు భవిష్యత్తుకు సంంబంధించిన చాలా విషయాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని మూలాంకాలకు ప్రేమ, వివాహం, ఆకర్షణ విషయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. వాటిలో ముఖ్యంగా మూలాంకం 6 అత్యంత అదృష్టవంతమైనదిగా పేర్కొంటారు.
ఏ నెలలోనైనా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూలాంకానికి శుక్రుడు అధిపతి, జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, అందం, ఆకర్షణ, కళలు, విలాసవంతమైన జీవితం, దాంపత్య సుఖాలకు కారకుడిగా భావిస్తారు. అందువల్ల మూలాంకం 6 కలిగిన వ్యక్తులో ప్రేమాభిమానాలు, సున్నితమైన భావోద్వేగాలు, సంబంధాలను కాపాడుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని అంటారు.
న్యూమరాలజీ ప్రకారం.. మూలాంకం 6 కలిగిన వారు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి మాట తీరు, ప్రవర్తన, ఇతరులను గౌరవించే విధానం కారణంగా చాలామంది వీరికి త్వరగా దగ్గరవుతారు. అందువల్ల స్నేహాలు, ప్రేమ సంబంధాలు సులభంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు ప్రేమకు ఎంతో విలువనిస్తారు. ఒక్కసారి ఎవరైనా మనసుకు దగ్గరైతే, వారితో బంధాన్ని కాపాడుకునేందుకు ఎంతదూరమైన వెళ్తారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా అందం మాత్రమే కాకుండా పరస్పర అవగాహన, భావోద్వేగ అనుబంధానికి ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. అందువల్ల వీరిలో చాలామంది కోరుకున్న జీవిత భాగస్వామిని పొందగలరని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
పెళ్లి తర్వాత కూడా జీవితం సంతోషంగా కొనసాగేందుకు వీరు కృషి చేస్తారని న్యూమరాలజీ చెబుతోంది. కుటుంబసభ్యుల పట్ల శ్రద్ధ, ప్రేమ, భాధ్యతాయుతమైన వైఖరితో ఉంటారు. అయితే శుక్రుడి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున పాలు, పెరుగు, బియ్యం, పంచదార వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం శుభప్రదమని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. అలాగే ఓం శుం శుక్రాయ నమః లేదా ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః మంత్రాలను జపించడం వల్ల శుక్ర బలం పెరుగుతుంది.
Read More:
Numerology | వీళ్లు యాటిట్యూడ్‌లో కింగ్.. అయినా సక్సెస్ కోసం గొడ్డులా కష్టపడతారు..!
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
- Tags
- astrology
- Horoscope
- June
- numerology
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

