Bhadra Rajayogam | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తమ రాశులతో పాటు నక్షత్రాలను మార్చుకుంటాయి. ఇలా గ్రహాల తమ స్థానాలను మార్చుకునే సమయంలో కొన్ని యోగాలు ఏర్పడనున్నాయి. అవి శుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఓ వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఓ ప్రత్యేక యోగం ఏర్పడబోతున్నది. బుధగ్రహం సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో బుధ సంచారంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడనున్నది. ఇది అత్యంత శక్తివంతమైన యోగం. యోగం ప్రభావం కారణంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి అద్భుతమైన అదృష్టం వరించనున్నది. కెరీర్లో పురోగతి, వ్యాపారంలో లాభం, సమాజంలో గౌరవం పొందే బలమైన అవకాశాలున్నాయి. ఇంతకీ అ అదృష్ట రాశులవారెవరో చూద్దాం రండి..!
మిథునరాశి వారికి భద్రయోగం చాలా అదృష్టం వరించనున్నది. బుధుడు ఈ రాశి నాల్గో ఇంట్లో సంచరించనున్నాడు. ఈ ఇల్లు, సౌకర్యం, ఆస్తి, తల్లికి సంబంధించింది. ఈ సంచారం ప్రత్యక్ష ప్రభావం భౌతిక సుఖాల్లో పెరుగుదల రూపంలో కనిపిస్తుంది. ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు లేదంటే ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో చిక్కుకున్న వారు కూడా ఈ సమయంలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. తల్లితో సంబంధాలు మరింత బలపడుతాయి. తల్లి నుంచి ఆర్థిక సాయం అందుకుంటారు. ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్న ప్రణాళికలు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందం, ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేతికందకుండా పోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే, మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. కుటుంబ జీవితంలో కూడా సమతుల్యత ఉంటుంది.
సెప్టెంబర్లో ఏర్పడిన భద్ర మహాపురుష రాజ్యయోగం సింహరాశి వారికి చాలా శుభాలు కలుగనున్నాయి. ఈ సమయంలో బుధుడు మీ రాశిచక్రం రెండో ఇంట్లో సంచరించనున్నాడు. ఇది డబ్బు, వాక్చాతుర్యం, కుటుంబ సంబంధాలకు సంబంధించినది. ఈ సమయంలో పాత పెట్టుబడులు, ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగనున్నది. మాట్లాడే నైపుణ్యం మెరుగుపడుతుంది. దాంతో జనాలను ఆకట్టుకుంటారు. ముఖ్యంగా మార్కెటింగ్, మీడియా, బ్యాంకింగ్, అమ్మకాలు, ప్రసంగ సంబంధిత రంగాల్లో పనిచేసే వారికి.. ఈ సమయం గొప్పగా ఉంటుందని తెలుస్తుంది. ప్రణాళికలు, వ్యూహాలతో శత్రువులపై విజయం సాధిస్తాయి. క్లిష్ట పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది.
ఈ సమయం ధనుస్సు విజయం, శ్రేయస్సును తీసుకువస్తుంది. బుధుడు రాశిచక్రం నుంచి పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది వృత్తి, వ్యాపారానికి సంబంధించింది. రాజయోగం కారణంగా ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వృత్తిపరమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. కొంత బాధ్యతలను పొందే అవకాశం ఉంది. విద్య, బ్యాంకింగ్, అకౌంటింగ్, మీడియా, స్టాక్ మార్కెట్ రంగంలోనివారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త ఆర్డర్లు, ప్రాజెక్టులను పొందే అవకాశం ఉంది. దాంతో ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. కార్యాలయంలో జూనియర్లు, సీనియర్లు ఇద్దరి నుంచి మద్దతు లభిస్తుంది. దాంతో మీ పని సులభతరమవుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది.