e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home రాశి ఫలాలు 13-03-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు

13-03-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు

13-03-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ‌కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హించుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు. 

వృష‌భం: అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్తగా ఉండాలి. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాల‌కోసం వేచి ఉంటారు. దైవ‌ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. 

మిథునం: స‌్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇత‌రుల‌కు అప‌కారం క‌లిగించే ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌మిస్తే అనారోగ్య బాధ‌లు ఉండ‌వు. 

క‌ర్కాట‌కం: నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, వాహ‌న, ఆభ‌ర‌ణ‌, లాభాల‌ను పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం పూర్త‌వుతుంది. 

సింహం: త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విష‌యాల్లో మానసిక ఆందోళ‌న చెందుతారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. ఆవేశంవ‌ల్ల కొన్ని ప‌నులు చెడిపోతాయి. 

క‌న్య‌: ప‌్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. పిల్ల‌ల‌ప‌ట్ల  మిక్కిలి ప‌ట్టుద‌ల ప‌నికిరాదు. ప‌గ సాధించే ప్ర‌య‌త్నాన్ని వ‌దిలివేయ‌డం మంచిది. 

తుల‌: కోరుకునేది ఒక‌టైతే జ‌రిగేది మ‌రొక‌టి అవుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. వేళ ప్ర‌కారం భుజించ‌డానికి ప్రాధాన్య‌మిస్తారు. చంచ‌లంవ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మ‌నోనిగ్ర‌హానికి ప్ర‌య‌త్నించాలి. పిల్ల‌ల‌ప‌ట్ల ఏమాత్రం అశ్రద్ధ ప‌నికిరాదు. 

వృశ్చికం: గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌మిస్తారు. 

ధ‌నుస్సు: ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. క్రీడాకారులు, రాజ‌కీయ‌రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. 

మ‌క‌రం: వృత్తి ఉద్యోగ‌రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉంటాయి. ఏ విష‌యంలోనూ స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అనుకోని ఆప‌ద‌ల్లో చిక్కుకోకుండా గౌర‌వ‌, మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. 

కుంభం: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌టంతో మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. నిన్న‌టివ‌ర‌కు వాయిదా వేయ‌బ‌డిన కొన్ని ప‌నులు ఈ రోజు పూర్తి చేసుకోగ‌లుగుతారు. ముఖ్య‌మైన వ్య‌క్తులను క‌లుస్తారు. 

మీనం: కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హాలు ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. 

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
13-03-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement