మేషం : రుణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
వృషభం : రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
మిథునం : పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కర్కాటకం : ఇతరులచే గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహం : తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధఙంచిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కన్య : తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
తుల : ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిల పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
వృశ్చికం : విందులు, వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురగును. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ధనుస్సు : కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధాన్యం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు.
మకరం : కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
కుంభం : బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు.
మీనం : అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868