e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News 2-06-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

2-06-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

2-06-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గ‌డం మంచిది. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది.

వృష‌భం: విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

మిథునం: వ్య‌వ‌సాయ‌రంగంలోనివారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. తొంద‌ర‌పాటువ‌ల్ల ప్ర‌య‌త్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండ‌టం మంచిది. ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి. శారీర‌కంగా బ‌ల‌హీనం ఏర్ప‌డుతుంది.

క‌ర్కాట‌కం: విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నోవిచారాన్ని పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టంప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు.

సింహం: శుభకార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. ప్ర‌యాణాల వ‌ల్ల లాభం చేకూరుతుంది. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. ధ‌న‌చింత ఉండ‌దు. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

క‌న్య‌: వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మాన‌సిక ఆందోళ‌నతో కాలం గ‌డుపుతారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ర‌హ‌స్య శ‌త్రువుల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు.

తుల‌: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ‌వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ఆత్మీయుల స‌హాయ‌స‌హ‌కారాల‌కై స‌మ‌యం వెచ్చించాల్సి వ‌స్తుంది.

వృశ్చికం: అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. ఆక‌స్మిక ధ‌న‌వ్య‌యం అయ్యే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు.

ధ‌నుస్సు: ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. అనారోగ్య బాధ‌లు తొల‌గ‌డానికి డ‌బ్బు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తారు. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

మ‌క‌రం: నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చ‌ర్చ‌లు, స‌ద‌స్సులు మిమ్మ‌ల్ని ఆక‌ర్షిస్తాయి. మ‌నోధైర్యాన్ని క‌లిగి ఉంటారు. శుభ‌వార్త‌లు వింటారు.

కుంభం: చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. కొన్ని ప‌నులు వాయిదావేసుకోవాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాలు ఉంటాయి.

మీనం: అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్యం ఏర్ప‌డుతుంది. పిల్ల‌ల‌ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టం అంత మంచిదికాదు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. మ‌నోద్వేగానికి గుర‌వుతారు. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. కొత్త ప‌నులు ప్రారంభించ‌కూడ‌దు.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
2-06-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement