మేషం
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం.
వృషభం
అన్ని కార్యములయందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
మిథునం
పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
సింహం
తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
కన్య
అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడడం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రతమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
తుల
ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీలమూలకంగా శత్రుబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
వృశ్చికం
ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణబాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు.
ధనస్సు
ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులు సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
మకరం
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బందిపడుతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
కుంభం
ధర్మాకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం
అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.