e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News 30-07-2021 వారం.. మీ రాశి ఫ‌లాలు

30-07-2021 వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం : ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగ‌ముంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లుంటాయి. అంత‌టా అనుకూలా వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు.

వృష‌భం : బంధు, మిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్య విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ‌తో పాటు, మాన‌సికాందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు.

- Advertisement -

మిథునం : ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలెదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెలుగుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మించుట‌కు రుణ ప్ర‌య‌త్నం చేస్తారు. కుటుంబ విష‌యాల్లో మార్పులు ఉంటాయి.

క‌ర్కాట‌కం : ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. అజీర్ణ బాధ‌త‌లు అధిక‌మ‌గును. కీళ్ల నొప్పుల బాధ నుండి ర‌క్షించుకోవ‌డం అవ‌స‌రం. మ‌నో విచారాన్ని క‌లిగి ఉంటారు.

సింహం :  స్త్రీల మూల‌కంగా లాభాలు ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

క‌న్య : అద్భుతమైన అవ‌కాశాల‌ను పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాలు సంపూర్ణంగా ల‌భిస్తాయి. అనుకోకుండా డ‌బ్బు  చేతికందుతుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు సేక‌రిస్తారు.

తుల :  వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పెరుగుతాయి. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి.

వృశ్చికం : ఆరోగ్యం గూర్చి జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతోంది. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మేలు. స‌హ‌నం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. డ‌బ్బును పొదుపుగా వాడుతారు.

ధ‌నుస్సు : నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వ‌ర‌కు అస‌త్యానికి దూరంగా ఉండుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతారు.

మ‌క‌రం : పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందుల‌నెదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డుతారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధ‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. నూత‌న వ్య‌క్తులు ప‌రిచ‌య‌మ‌వుతారు.

కుంభం : అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు వినాల్సి  వ‌స్తుంది. ఆకస్మిక ధ‌న న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. మ‌న‌స్తాపానికి గుర‌వుతారు. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు.

మీనం : ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఒక ముఖ్య‌మైన ప‌ని పూర్తి కావ‌డంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్ర‌తిష్ట‌లు పొందుతారు. శాశ్వ‌త ప‌నుల‌కు శ్రీకారం చుడుతారు.

పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్‌, హైదరాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana