మేషం : రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. వృత్యిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.
వృషభం : ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది.
మిథునం : బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు.
కర్కాటకం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు.
సింహం : వ్యాపారంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి.
తుల : ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది.
వృశ్చికం : వ్యవసాయం మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసముంటుంది.
ధనుస్సు : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
మకరం : కుటుంబమంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది.
కుంభం : ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
మీనం : అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు.