మేషం
ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. రుణబాధలు తొలగిపోతాయి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శత్రుబాధలు ఉండవు.
వృషభం
ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైరసాహసాలతో ముందుకు వెళ్తారు. ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
మిథునం
వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు.
కర్కాటకం
కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఆందోళనతో ఉంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
సింహం
కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
కన్య
స్త్రీలమూలకంగా ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. ఊహించనికార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.
తుల
అన్నింటా విజయాన్నే సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. బంధు, మిత్రులు కలుస్తారు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.
వృశ్చికం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది.
ధనుస్సు
నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మకరం
నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. చంచలం అధికమవుతుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. మనోల్లాసాన్ని పొందుతారు. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
మీనం
క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది.