Hans Mahapurush Rajayogam | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు, నక్షత్రరాశుల సంచారంతో నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. ఇవి ఓ వ్యక్తి జీవితంలో భారీ మార్పులు తీసుకురానున్నాయి. అలాంటి అత్యంత శుభకరమైన యోగాల్లో ఒకటి హంస మహాపురుష రాజయోగం. ఈ యోగం దేవ గురువు బృహస్పతి కారణంగా ఏర్పడుతుంది. ఇది వ్యక్తిగత జీవితంపై మాత్రమే కాకుండా సమాజం, దేశం, ప్రపంచ స్థాయిలోనూ కనిపిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ యోగం 12 సంవత్సరాల తర్వాత అక్టోబర్లో ఏర్పడబోతున్నది. ఈ యోగం ప్రభావంతో పలు రాశుల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఆయా రాశుల వారికి డబ్బు, జీవితంలో పురోగతి, అకస్మాత్తుగా అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. రాజయోగం కారణంగా ఏ రాశులవారికి అదృష్టం వరించనున్నదో తెలుసుకుందాం..!
జ్యోతిషశాస్త్రంలో పంచ మహాపురుష యోగాల్లో హంస మహాపురుష యోగం అత్యంత శుభకరమైన, శక్తివంతమైన యోగాలలో ఒకటి. బృహస్పతి ధనుస్సు, మీనం లేకపోతే కర్కాటక రాశిలో ఉండాలి. లగ్నం నుంనుంచి 1, 4, 7 లేదంటే 10వ ఇంట్లో ఉన్నప్పుడు హంస యోగం ఏర్పడుతుంది. బృహస్పతి ధనుస్సు, మీన రాశిచక్రాలకు అధిపతి. కర్కాటక రాశిలో ఉన్నతంగా ఉంటాడు. యోగా బలం బృహస్పతి బలంతో పాటు బృహస్పతిపై ఇతర గ్రహాల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. బృహస్పతి 5 -25 డిగ్రీల మధ్య ఉండి, కుజుడు, శని , రాహువు, కేతువు గ్రహాలతో సంబంధం ఉండకూడదు. అలాగే, 6, 8, 12వ ఇంట్లో అధిపతి గ్రహాన్ని బాధించకూడదు. నవాంశలో బలహీనంగా ఉండకూడదని పండితులు పేర్కొంటున్నారు. దాంతో ఈ యోగం ఆయా రాశులవారి జీవితంపై చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ యోగం కారణంగా ఓ వ్యక్తి సమాజంలో ప్రతిష్ట పెరగడంతో గౌరవాన్ని పొందుతాడు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, నైతిక విలువ పుష్కలంగా ఉంటాయి. హంస యోగం భౌతిక పురోగతికి మాత్రమే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక విషయంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.
హంస మహాపురుష రాజయోగం ఆర్థికంగా చాలా శుభప్రదంగా పండితులు పేర్కొంటున్నారు. దేవ గురువు బృహస్పతి మిథున రాశి రెండవ ఇంట్లో సంచరించనున్నాడు. ఇది సంపద, వాక్కు, కుటుంబ ఆనందానికి సంబంధించినది. ఈ సమయంలో ఆకస్మిక ద్రవ్య లాభం కలిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ సమయంలో జీవితంలోకి ఆనందం తిరిగి వచ్చినట్లుగా భావిస్తారు. బృహస్పతి ఏడవ, పదవ ఇంటికి సైతం అధిపతి కూడా. కాబట్టి వివాహితుల వైవాహిక జీవితం మరింత మధురంగా మారుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే సూచనలున్నాయి. అదే సమయంలో కెరీర్లో వృద్ధి, ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
హంస మహాపురుష రాజ్యయోగంతో కన్య రాశి వారికి చాలా శుభాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. రాశిచక్రం కోసం లాభం, పెట్టుబడికి సంబంధించిన ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతున్నది. దాంతో మీ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తిన్నాయి. ముఖ్యంగా వ్యాపారం, ఆర్థిక లావాదేవీల్లో ఉండే వారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. అలాగే, గతంలో చేతికి అందకుండా పోయిన డబ్బు తిరిగి మీకు అందుతుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ప్రణాళికలు మళ్లీ కార్యరూపం దాలుస్తాయి. ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెడితే వ్యాపారవేత్తలు, వ్యాపారులకు ప్రయోజనం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. సంబంధాలు బలపడడంతో పాటు పరస్పర అవగాహన పెరుగుతుంది. స్టాక్స్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వారు ఆకస్మికంగా లాభాలను పొందే అవకాశాలున్నాయి.
హంస మహాపురుష రాజ్యయోగం వృశ్చిక రాశి వారికి సైతం శుభకరంగా ఉంటుంది. బృహస్పతి సంచారంతో అదృష్టం వరించనున్నది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా మతపరమైన, ఆధ్యాత్మిక, కుటుంబ శుభకార్యంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహితులకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దాంతో సొంత వ్యాపారంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పనికి సంబంధించిన ప్రయాణాలు కూడా విజయవంతమవుతాయి. ఆర్థికంగా భవిష్యత్తులో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది.