Guru Asta | జ్యోతిషశాస్త్రం ప్రకారం అదృష్టం, వివాహం, సంతోషానికి కారకంగా గురు గ్రహాన్ని పరిగణిస్తుంటారు. ప్రస్తుతం దేవగురువు బృహస్పతి మిథునరాశిలో ఉన్నాడు. అక్టోబర్ నెల వరకు ఈ రాశిలోనే ఉండనున్నాడు. గురువు నేడు (జూన్ 9న) సాయంత్రం 4.12 గంటలకు మిథునరాశిలో ఉండగా అస్తమిస్తాడు. ఈ అస్తమయం జూలై 9 లేదంటే 10వ తేదీ వరకు ఉంటుంది. ఈ కాలంలో 12 రాశుల మీద గురువు ప్రభావం ఉండనున్నది. కొందరికి లాభాలు, మరికొందరికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, మేష, వృశ్చిక, కుంభ రాశుల వారికి ఈ సమయం మంచి ఫలితాలుంటాయని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. ఎందుకంటే బృహస్పతి జ్ఞానం, విద్య, వివాహ సౌఖ్యం, సంపద, వృత్తికి అధిపతిగా భావిస్తుంటారు. ఏయే రాశుల వారిని అదృష్టం వరించబోతున్నదో తెలుసుకుందాం రండి..!
Aries
గురు అస్తమయం సమయంలో మేషరాశి వారికి కెరియర్లో అద్భుతమైన ప్రయోజనాలు లభించనున్నాయి. విద్యా రంగంలో ఉన్న వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. ధన లాభం జరిగే అవకాశాలున్నాయి. మీరు మీ కెరియర్ని ఇప్పుడే కొత్తగా ప్రారంభిస్తుంటే.. అద్భుతమైన పురోగతి సాధిస్తారు. బృహస్పతి సంచారంతో ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. వ్యాపారవేత్తలకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. విభేదాలు దూరమవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు, సహకారం అందుతుంది.
Scorpio
ఈ సమయం స్వీయ అభివృద్ధికి దోహదపడుతుంది. గురువు సంచారంతో జీవితంలోని అన్ని ప్రతికూలతలు క్రమంగా తగ్గుతాయి. ప్రత్యేకత ఏమిటంటే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గురువు ప్రభావంతో ప్రతి రంగంలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులుంటాయి. తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలుంటాయి. ఆదాయంలో మార్పులుంటాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే సూచనలున్నాయి.
Aquarius
గురువు అస్తమయం సమయంలో కుంభరాశి మంచి ఫలితాలుంటాయి. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గురు ప్రభావం కారణంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. విద్యా రంగంలో ఉన్న వారు గొప్ప విజయాలను పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులుంటాయి.