Ashtadasha Yoga | జ్ఞానదాత అయిన బుధుడు, న్యాయ కారకుడైన శశి రెండూ 18 డిగ్రీల కోణంలో ఉండనున్నాయి. మే ఒకటి నుంచి ఈ గ్రహాల ఈ స్థానం అష్టాదశ యోగాన్ని ఏర్పరచనున్నది. ఇది అన్ని రాశీచక్రాలను ప్రభావితంచేయనున్నది. జ్యోతిష్యశాస్త్రంలో.. బుధుడు వాక్కు, కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపారానికి.. శని కర్మ ఆధారంగా శుభ, అశుభ ఫలితాలను ప్రసాదిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఏదైనా ఇతర గ్రహాలతో సంచారానికి గురైనప్పుడు.. గ్రహాల సంయోగంతో పలు రాశులకు ప్రయోజనాలు కలుగనున్నాయి.
వృషభ రాశి వారికి అష్టాదశ యోగం కొత్త ఉద్యోగ అవకాశాలను రానున్నాయి. ఈ యోగ ప్రభావం కారణంగా కొత్త ఇల్లు కొనాలనే మీ కల నేరవేరనున్నది. వ్యాపారవేత్తలకు ఆకస్మిక లాభం జరిగే ఛాన్స్ ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో డబ్బు కొరతను ఎదుర్కొనే వారు లాభపడే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే వారికి లాభాలుంటాయి.
అష్టాదశ యోగం మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కొత్త వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది. మీ పనిలో సమస్యలు శని ప్రభావంతో పరిష్కరమవుతాయి. కొత్త ప్రయత్నాలలో కొన్ని ఫలిస్తాయి. శత్రువుల బాధలు తగ్గిపోతాయి. చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. వివాహిత జీవితంలో శుభవార్తలు వింటారు.
అష్టాదశ యోగంతో ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారు.. కోరుకున్న స్థానం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఏదైనా కారణంతో ప్రణాళికలు నిలిచిపోతే.. బుధ గ్రహం ప్రభావంతో ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కావాల్సిన లాభంతో ఆర్థిక పరిస్థితిని మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభావం ఉంటుంది.