సిటీబ్యూరో,(నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ( Telangana) ప్రాంతంలో పండుగలు ఏయే రోజుల్లో జరుపుకోవాలో నిర్ణయం జరుగుతోంది. ఈ క్రమంలో రాబోయే 2026-27 శ్రీపరాభవ నామ (Sri Parabhava Nama) సంవత్సరానికి సంబంధించి విద్వత్సభ పండుగల నిర్ణయం , తేదీలను ప్రకటించింది.
2026 సంవత్సరంలో మార్చ్ 19న ఉగాది, అక్టోబర్ 18న బతుకమ్మ పండుగ, అక్టోబర్ 20న దసరా, నవంబర్ 8న దీపావళి జరుపుకోవాలని సిద్ధాంతులు నిర్ణయించినట్లు విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞానసిద్ధాంతి ప్రకటించారు.
చైత్రమాసం..
19-3-2026 గురు సంవత్సరాది, వసంత నవరాత్రోత్సవారంభం
21-3-2026 శని డోలా గౌరీవ్రతం
23-3-2026 ఆది మత్స్యజయంతి, లక్ష్మీపంచమి
27-3-2026 శుక్ర సర్వేషాం శ్రీరామనవమి( Sri Ramanavami)
02-4-2026 గురు హనుమద్విజయోత్సవం
వైశాఖమాసం..
19-4-2026 ఆది పరుశురామజయంతి
20-4-2026 సోమ అక్షయతృతీయ
21-4-2026 మంగళ శంకరజయంతి
22-4-2026 బుధ రామానుజజయంతి
26-4-2026 ఆది వాసవీజయంతి, బ్రహ్మంగారి ఆరాధన
30-4-2026 గురు సర్వేషాం నృసింహజయంతి
01-5-2026 శుక్ర వైశాఖపౌర్ణమి
04-5-2026 సోమ వాస్తు కర్తరీ ప్రారంభం
11-5-2026 సోమ హనుమజ్జయంతి
అధికజ్యేష్టమాసం..
25-5-2026 సోమ అగ్నికర్తరీ త్యాగః
29-5-2026 శుక్ర వాస్తు కర్తరీ త్యాగః
13-6-2026 శని శనిత్రయోదశి
నిజజ్యేష్టమాసం
16-6-2026 మంగళ బౌద్ద,కల్కి జయంతి
29-6-2026 సోమ ఏరువాక పూర్ణిమ, వటసావిత్రీ వ్రతం
ఆషాఢమాసం
16-7-2026 గురు జగన్నాథరథయాత్ర
17-7-2026 శుక్ర దక్షిణాయన పుణ్యకాలం
25-7-2026 శని తొలిఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం
29-7-2026 బుధ వ్యాసపౌర్ణమి, గురుపౌర్ణమి
02-8-2026 ఆది సికింద్రాబాద్ మహంకాళి జాతర
09-8-2026 ఆది హైదరాబాద్ మహంకాళి జాతర
12-8-2026 బుధ చుక్కల అమావాస్య
శ్రావణమాసం
16-8-2026 ఆది నాగచతుర్థి
17-8-2026 సోమ గరుడ, నాగ పంచమి
21-8-2026 శుక్ర వరలక్ష్మీవ్రతం
28-8-2026 శుక్ర రాఖీపౌర్ణమి
04-9-2026 శుక్ర సర్వేషాం శ్రీకృష్ణాష్టమి
11-9-2026 శుక్ర పొలాల అమావాస్య
భాద్రపదమాసం
14-9-2026 సోమ వినాయకచవితి( Vinayaka Chaviti)
15-9-2026 మంగళ రుషిపంచమి
25-9-2026 శుక్ర అనంతవ్రతం
27-9-2026 ఆది మహాలయపక్షారంభం
10-10-2026 శని మహాలయఅమావాస్య(పెత్రామాస్య)
ఆశ్వీయుజ మాసం
11-10-2026 ఆది దేవీశరన్నవరాత్రుల ప్రారంభం, కలశస్థాపన
16-10-2026 శుక్ర మూలానక్షత్రం, సరస్వతీపూజ
18-10-2026 ఆది దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ
19-10-2026 సోమ మహార్నవమి, సువాసినీ పూజ
20-10-2026 మంగళ విజయదశమి(దసరా)
25-10-2026 ఆది కోజాగర వ్రతం
08-11-2026 ఆది దీపావళి (Deepavali) , ధనలక్ష్మీ పూజలు
09-11-2026 సోమ కేదారీశ్వర వ్రతం
కార్తీకమాసం
10-11-2026 మంగళ భగినీహస్తభోజనం
13-11-2026 శుక్ర నాగచతుర్థి
21-11-2026 శని చిలుకుద్వాదశి, తులసీవ్రతారంభం
24-11-2026 మంగళ కార్తీకపౌర్ణమి, జ్వాలాతోరణం
మార్గశిర మాసం
15-12-2026 మంగళ సుబ్రహ్మణ్యషష్ఠి
20-12-2026 ఆది వైకుంఠ ఏకాదశి, గీతాజయంతి
22-12-2026 మంగళ హనుమద్వ్రతం
23-12-2026 బుధ దత్తాత్రేయజయంతి
31-12-2026 గురు కాలభైరవాష్టమి
పుష్యమాసం
14-01-2027 గురు భోగిపండుగ, మకరసంక్రమణం(రా.3.12ని.లకు)
15-01-2027 శుక్ర సంక్రాంతి, ఉత్తరాయణపుణ్యకాలం
16-01-2027 శని కనుమ
మాఘమాసం
11-02-2027 గురు వసంతపంచమి
13-02-2027 శని రథసప్తమి
20-02-2027 శని మాఘపూర్ణిమ
ఫాల్గుణ మాసం
22-03-2027 సోమ హోలీపండుగ
07-04-2027 బుధ శ్రీప్లవంగ నామ సంవత్సరం ఉగాది
పుష్కరాలు:
యమునానదీపుష్కరాలు (01-06-2026 రా.1.30కు పుష్కర ప్రవేశం, 02-06-2026 అరుణోదయవేళ పుష్కరస్నానారంభం)
గ్రహణాలు:
ఈ సంవత్సరం మన ప్రాంతంలో కనిపించే గ్రహణాలు లేవు.