గురువు: ఈ ఏడాది జూన్ 1వ తేదీ వరకు మిథునంలో, తర్వాత అక్టోబర్ 31వరకు కర్కాటకంలో, తర్వాత ఏడాది ముగిసే వరకు సింహంలో సంచరిస్తాడు.
శని: ఈ ఏడాదంతా మీనంలో సంచరిస్తాడు.
రాహువు: ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకు కుంభంలో సంచరిస్తాడు.
కేతువు: ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకు సింహంలో సంచరిస్తాడు.
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ ఏడాది గురువు 3-4-5, శని 12, రాహు-కేతువులు 11, 5 స్థానాలలో సంచరిస్తున్నారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పు ఆలోచనలు ఫలిస్తాయి. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబం ఒక్కతాటిపైకి వస్తుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ బాధలు తీరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూమి కొనుగోలు విషయంలో ఏమరుపాటు తగదు. సోదరులు, ఆత్మీయులతో సంబంధాలు మెరుగవుతాయి. విదేశీయాన అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. అడపాదడపా మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. గురు కటాక్షం పొందుతారు. పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.
పరిహారం: శని అనుగ్రహం కోసం నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి.
(కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)
ఈ ఏడాది గురువు 2-3-4, శని 11, రాహు-కేతువులు 10, 4 స్థానాలలో సంచరిస్తున్నారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి వస్తుంది. వ్యాపార విస్తరణకు ఈ ఏడాది అనుకూలం. మిత్రుల సహాయం అందుతుంది. చెప్పుడు మాటలు పట్టించుకోకండి. దాంపత్యంలో సర్దుకుపోవడం అవసరం. పిల్లల చదువు విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. భూమి, గృహం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. రుణ భారం తగ్గుతుంది. దార్మిక చింతన పెరుగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. గురువు పూర్తిస్థాయిలో అనుగ్రహిస్తున్నాడు. శని వల్ల ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. ఈ ఏడాదంతా శుభప్రదంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి.
(మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
ఈ ఏడాది గురువు 1-2-3, శని 10, రాహు-కేతువులు 9, 3 స్థానాలలో సంచరిస్తున్నారు. ఈ ఏడాది మీకు అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. రాబడి మార్గాలు అధికమవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. సోదరుల సహకారం లభిస్తుంది. పని చేసే చోట నాయకత్వ బాధ్యతలు చేపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం ఉత్తమంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ బుధవారం విష్ణు సహస్రనామాలు పఠించండి.
(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కర్కాటకం: ఈ ఏడాది గురువు 12-1-2, శని 9, రాహు-కేతువులు 8, 2 స్థానాలలో సంచరిస్తున్నారు. ఈ ఏడాది గురు బలం అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం అందుకుంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. దాంపత్య జీవితం సరదాగా సాగిపోతుంది. పిల్లల వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి గతేడాది కన్నా.. ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సోదరుల వల్ల లబ్ధి పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఈ ఏడాదంతా విజయవంతంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ సోమవారం శివాలయాన్ని సందర్శించండి.
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ ఏడాది గురువు 11-12-1, శని 8, రాహు-కేతువులు 7, 1 స్థానాలలో సంచరిస్తున్నారు. కేతువు ప్రభావం వల్ల ఆలోచనా సరళిలో మార్పులు వస్తాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. కొన్ని బాధ్యతల నుంచి తప్పుకొనే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శత్రువులను తక్కువ అంచనా వేయకండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఏడాది ప్రథమార్ధంలో కొన్ని చికాకులు ఉన్నా.. ద్వితీయార్థం బేషుగ్గా సాగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభకార్యాలకు ధన వ్యయం అవుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రుణ భారం పెరగకుండా చూసుకోవాలి. పితృవర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. గురువు అనుగ్రహంతో పలుకుబడి పెరుగుతుంది. ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. సంవత్సరం చివర్లో ఆకస్మిక ధన యోగ సూచన.
పరిహారం: ప్రతీ గురువారం దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
(ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఈ ఏడాది గురువు 10-11-12, శని 7, రాహు-కేతువులు 6, 12 స్థానాలలో సంచరిస్తున్నారు. గురువు, రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలనం కలుగుతాయి. వ్యాపారులకు బాగా కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. స్థిరాస్తి మూలంగా ఆదాయం సంప్రాప్తిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం వస్తుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. రుణ బాధలు దాదాపు తీరిపోతాయి. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని ధైర్యంగా అమలుపరుస్తారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఈ ఏడాది శుభప్రదంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ బుధవారం గణపతి స్తోత్రాలు పఠించండి.
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
ఈ ఏడాది గురువు 9-10-11, శని 6, రాహు-కేతువులు 5, 11 స్థానాలలో సంచరిస్తున్నారు. ఈ ఏడాది మీరు పట్టిందల్లా బంగారమే అన్న చందంగా సాగుతుంది. ఆర్థికంగా మంచి విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి సూచన ఉంది. వ్యాపారులకు అన్నిరకాలుగా కలిసొస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సోదరులతో అనుబంధం పెరుగుతుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. నమ్మకమైన తోడు దొరుకుతుంది. దాంపత్యంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ధార్మిక చింతన పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఈ ఏడాది అనుకూలం. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రుబాధలు తొలగిపోతాయి. రుణాలు తీరిపోతాయి. విదేశీయానానికి అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనం, గృహం కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది విజయవంతంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం పఠించండి.
(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
ఈ ఏడాది గురువు 8-9-10, శని 5, రాహు-కేతువులు 4, 10 స్థానాలలో సంచరిస్తున్నారు. ఈ ఏడాది మీ జీవితంలో విశేషమైన మార్పులకు కారణం అవుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పరిస్థితులకు తగ్గట్టుగా నేర్పుగా వ్యవహరిస్తారు. ఉద్యోగం, కుటుంబ విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని విజయవంతంగా అమలు చేస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా.. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఏడాది ద్వితీయార్ధం అనుకూలంగా ఉంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గతంలో నిలిచిపోయిన పనులు ఈ ఏడాది పూర్తవుతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. మొత్తంగా ఈ ఏడాది సింహభాగం అనుకూల ఫలితాలు పొందుతారు.
పరిహారం: ప్రతీ మంగళవారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఈ ఏడాది గురువు 7-8-9, శని 4, రాహు-కేతువులు 3, 9 స్థానాలలో సంచరిస్తున్నారు.ఈ ఏడాది గురువు అనుగ్రహం బాగుంది. అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహ యోగం బలంగా ఉంది. ప్రయత్నలోపం లేకుండా చూసుకోండి. పిల్లలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. మీ కారణంగా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఏడాది ప్రారంభంలో కాస్త చికాకులు ఉన్నప్పటికీ.. క్రమంగా తొలగిపోతాయి. పెట్టుబడుల వల్ల లాభాలు పొందుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం పాటిస్తే ఈ ఏడాది అద్భుతంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ గురువారం దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)
ఈ ఏడాది గురువు 6-7-8, శని 3, రాహు-కేతువులు 2, 8 స్థానాలలో సంచరిస్తున్నారు. ఈ ఏడాది శని మీకు విశేషమైన ఫలితాలు అందిస్తాడు. ఫలితంగా శ్రమకు తగ్గ విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగా రాబడి ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు మంచి సమయం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు విశేషమైన లాభాలను గడిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రథమార్ధంలో గురువు శుభ ఫలితాలు ఇస్తాడు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. కాస్త ధైర్యంగా అడుగేస్తే ఈ ఏడాది అద్భుతంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ ఆదివారం దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
(ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
ఈ ఏడాది గురువు 5-6-7, శని 2, రాహు-కేతువులు 1, 7 స్థానాలలో సంచరిస్తున్నారు. ఈ ఏడాది రాహువు ప్రభావం కొంత ప్రతికూలంగా ఉంది. గురువు అండగా ఉంటాడు. ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధంలో ఎక్కువగా రాణిస్తారు. ఆర్థికంగా విశేషమైన విజయాలు సాధిస్తారు. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏల్నాటి శని చివరి దశకు చేరుకున్నారు. మంచి మార్పులు మొదలవుతాయి. వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబంలో సందడి వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగంలో మార్పునకు అవకాశం. సంవత్సరం ప్రారంభంలో పనులు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటొద్దు. మొత్తంగా ఈ ఏడాది విజయవంతంగా సాగుతుంది.
పరిహారం: ప్రతీ శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ ఏడాది గురువు 4-5-6, శని 1, రాహు-కేతువులు 12, 6 స్థానాలలో సంచరిస్తున్నారు. జన్మ శని ప్రభావం వల్ల వృత్తివ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ అవసరం. ఉద్యోగులకు శ్రమ అధికమవుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా చికాకులు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. గురు, కేతువు బలంతో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మార్చి నుంచి జూన్ వరకు అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో గురువు మీకు పూర్తిస్థాయిలో యోగిస్తాడు. ఆదాయం పెరుగుతుంది. గృహ యోగం ఉంది. సంతానం విషయంలో శుభవార్త వింటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏల్నాటి శని ప్రభావం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవకుల వల్ల నష్టం జరగవచ్చు. కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఈ ఏడాది అనుకూలమనే చెప్పాలి.
పరిహారం: ప్రతీ గురువారం శివాలయాన్ని సందర్శించండి.
–గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in