మేషం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనులను బాధ్యతతో నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం దూర ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు సహచరులతో అసంతృప్తి కలుగవచ్చు. అధికారుల ఆదరణ ఉంటుంది. వివాహాది శుభకార్య యత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూలం. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి.
వృషభం
బాధ్యతలు పెరుగుతాయి. సమస్యలను విశ్లేషణాత్మక దృష్టితో చూసి, పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. సంయమనంతో వాటిని అధిగమిస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనుల మూలంగా ఖర్చు పెరుగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంది. కళాకారులకు అనుకూల వారం. ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేయడంలో జాప్యం జరుగవచ్చు. విద్యార్థులకు మిశ్రమ సమయం. ఉన్నత విద్య ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
మిథునం
ప్రారంభించిన పనులను సమయస్ఫూర్తితో పూర్తిచేస్తారు. విద్యార్థులు మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. పనులను అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో జాప్యం జరుగవచ్చు. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. కర్షకులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అవుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
తలపెట్టిన ప్రయాణాలు ఫలవంతంగా పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. అయితే, దానికి సరిపడా ఖర్చులూ ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో పెద్దల అభిప్రాయాలకు విలువనిస్తారు. వారి సూచనలను అమలు చేసి సత్ఫలితాలను పొందుతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పైఅధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
సింహం
వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచివారితో మైత్రి కుదురుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పోయిందనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో స్నేహంగా ఉంటూ ఆఫీసులో మంచి పేరును పొందుతారు. తద్వారా ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.
కన్య
కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ వ్యవహార ఒప్పందాల విషయంలో ఏమరపాటు తగదు. బంధువర్గంతో పనులు నెరవేరినా అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. వాహనం మూలంగా ఖర్చులు పెరుగవచ్చు. ఖర్చులపై నియంత్రణ అవసరం. నలుగురిలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచివ్యక్తుల సాహచర్యాన్ని పొందుతారు. స్నేహితుల మూలంగా పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూలమైన వారం. పెద్దల సహకారం లభిస్తుంది. ప్రోత్సాహకాలను పొందుతారు. పైచదువుల ప్రయత్నాలు కొనసాగుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
తుల
ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారులు, నాయకుల ఆదరణ లభిస్తుంది. అయితే, బాధ్యతలతో పనిభారం పెరుగవచ్చు. అందరిలో గౌరవ మర్యాదలను పొందుతారు. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. స్థిర, చరాస్తుల విషయంలో వివాదాలు కొంత వరకు పరిష్కరం అవుతాయి. భూములు, వాహనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభించడంతో ఉత్పాదకత పెరుగుతుంది.
వృశ్చికం
వ్యాపారస్తులకు అనుకూలం. గత పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అయితే, కొన్ని పరిష్కారం కావచ్చు. ప్రారంభించిన పనులలో తాత్కాలిక ఆటంకాలు రావచ్చు. ఓపికతో పరిష్కరించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగ, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ పనులలో విజయం చేకూరుతుంది. వ్యవసాయదారులకు కలిసివస్తుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి.
ధనుస్సు
సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. అలసట లేకుండా ఏకాగ్రతతో పనులు నిర్వర్తిస్తారు. కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరినా చిన్నపాటి అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కలిసివస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటివారితో స్నేహంగా ఉండటం ఈ వారం అవసరం.
మకరం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అదేసమయంలో ఖర్చులూ పెరుగుతాయి. నియంత్రణఅవసరం. వివాహాది శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచిస్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో వాటిని నిర్వర్తిస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాలలో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురెనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.
కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. గురుభక్తికి ప్రాధాన్యం ఇస్తారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూల వారం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఈ వారం కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవి పూర్తిచేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూములు, వాహనాల లావాదేవీల్లో ఏమరపాటు తగదు. ఉద్యోగస్తులు తోటివారితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు, విహార యాత్రలపై మనసు నిలుపుతారు.
మీనం
ఏకాగ్రతతో, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఆఫీసులో మంచిపేరు సంపాదిస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనులు కలిసివస్తాయి. కుటుంబంతో సంతృప్తిగా కాలం గడుపుతారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in