మేషం
వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల వారం. ఫలితాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల వల్ల కార్యం సఫలం అవుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల అండదండలతో మంచి పేరు సంపాదిస్తారు. అందరితోనూ స్నేహం పెంపొందుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ముందుకుసాగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలు అందుతాయి. అయితే, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చు విషయంలో నియంత్రణ తప్పనిసరి.
వృషభం
వృత్తిపరంగా పురోభివృద్ధి ఉంటుంది. సమస్యలను అధిగమిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రులతో ఇబ్బందులు ఉండవచ్చును. సంయమనం పాటించాలి. రాజకీయ, ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ పనులలో జాప్యం ఉంటుంది. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. పనులపై మనసు నిలుపుతారు. కొన్ని పనులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురు కావచ్చును. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. స్థిరాస్తి మూలకంగా ఆదాయం సమకూరుతుంది. నలుగురిలో పలుకుబడి సంపాదిస్తారు.
మిథునం
విద్యార్థులకు అనుకూలమైన వారం. ఉన్నత విద్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. పైఅధికారుల ఆదరణతో పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అయితే వృథా ఖర్చులు ఉంటాయి. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. భూముల కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. పారిశ్రామిక వేత్తలకు సిబ్బంది నుంచి ప్రతికూలత ఎదురైనా కార్యసాఫల్యం ఉంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
కర్కాటకం
ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారి సహకారం ఉన్నా, పై అధికారుల విమర్శలు ఉండవచ్చు. సంయమనంతో వ్యవహరించాలి. వాహనం మూలంగా అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పాత బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి.
సింహం
తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం సమకూరుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పని భారం పెరిగినా సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు అనుకూల వారం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. సాంస్కృతిక, ధార్మిక సేవాకార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలు సమస్యలు అధిగమిస్తారు. సిబ్బంది సహకారం పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీసులో మంచిపేరు వస్తుంది. కొన్ని విషయాలను బాధ్యతతో స్వీకరించి విజయవంతంగా పూర్తిచేస్తారు.
కన్య
ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. కళాకారులకు అనుకూలం. మంచి అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆదరణ పెరుగుతుంది. స్నేహితులు, బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నా.. పనులు నెరవేరుతాయి. వాహనం మూలకంగా ధన వ్యయ సూచనలున్నాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలపై మనసు నిలుపుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. విద్యార్థులకు చదువు విషయంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
తుల
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగాలలో చేరతారు. విద్యార్థులకు అనుకూల వారం. పైచదువులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం, పై అధికారుల ఆదరణ లభిస్తుంది. బరువు, బాధ్యతలను మనస్ఫూర్తిగా స్వీకరించి, సత్ఫలితాలను పొందుతారు. మిత్రులు, బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూలత ఉంది. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. శ్రమ అధికమైనా సత్ఫలితాలు సాధిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో మంచి పేరు సంపాదిస్తారు. వాహనం, వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇరుగుపొరుగు సహకారం లభిస్తుంది.
వృశ్చికం
ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. పూర్వంతో పోలిస్తే ఆదాయం మెరుగవుతుంది. బాకీలు వసూలు అవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అందరి సహకారం లభిస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. స్నేహితుల రాక సంతృప్తినిస్తుంది. ఇంటాబయటా అనుకూలత ఉంటుంది. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.
ధనుస్సు
ఆలోచనలను సరైన సమయంలో ఆచరణలో పెట్టి, సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఏకాగ్రతతో పనులు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు, బాధ్యతలు పెరుగవచ్చును. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉంటారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దైవ భక్తి పెరుగుతుంది. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా పడవచ్చు. కార్మికులకు, కర్షకులకు అనుకూల వారం. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
మకరం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులలో జాప్యం జరుగవచ్చు. నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు ఇరుగుపొరుగుతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అయితే, అందరి సహకారంతో వాటిని విజయవంతంగా నిర్వర్తిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
కుంభం
దైవభక్తి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు. వృథా ఖర్చుల మూలంగా అవసరానికి డబ్బు లేకుండా పోతుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఓపికతో పనులు చేయడం అవసరం. తోటి ఉద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలు న్యాయ సమస్యలను కొంత వరకు అధిగమిస్తారు.
మీనం
ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. గురుభక్తి పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. స్థిర, చరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులతో స్నేహంగా ఉంటారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in