మేషం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వాహనం, భూముల వలన ఖర్చులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
వృషభం
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పదోన్నతి లభించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. అయితే, ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథునం
పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. సంయమనం అవసరం. ఖర్చులు తగ్గించుకోవాలి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో జాప్యం ఉండవచ్చు. కోర్టు పనులు కలిసి వస్తాయి. ఆదాయంలో అస్థిరత కారణంగా అసంతృప్తి కలుగుతుంది. వివాదాల జోలికి వెళ్లకండి. విద్యార్థులకు కొంత అనుకూలం. శ్రమ పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యవసాయదారులకు మంచి వాతావరణం. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన పెంచుకుంటే మనశ్శాంతి.
సింహం
స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూమి కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం.
కన్య
ఈ వారం కార్యసాఫల్యం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. స్నేహితులు, బంధువర్గంతో పనులు కలిసి వస్తాయి. వాహనం, భూముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులు చేయడంపై మనసు నిలుపుతారు. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో ఆదరణ లభిస్తుంది. ఏకాగ్రత, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. రాబడి స్థిరంగా ఉంటుంది. అయితే యంత్రాల మూలంగా ఖర్చులు ఉండవచ్చు.
తుల
ఈ వారం ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందడంతో పనులలో జాప్యం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో కొనసాగుతాయి. వృథా ఖర్చుల మూలంగా ఆర్థికంగా అస్థిరత ఏర్పడవచ్చు. రాబడిపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, పనులపై మనసు నిలపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపార, ఆర్థిక లావాదేవీలలో జాప్యం జరగవచ్చు. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి.
కర్కాటకం
ప్రయాణాలు కలిసి వస్తాయి. వారం అంతా సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం రావచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా పరిచయం అయిన వారితో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచి పేరు పొందుతారు. గృహ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. సామరస్యంగా వ్యవహరించాలి. కళాకారులకు అనుకూల వాతావరణం. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
వృశ్చికం
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అయితే వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషం పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పదోన్నతి మూలంగా స్థాన చలనం ఉండవచ్చు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి సమయం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
ధనుస్సు
నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పెద్దల సూచనలను పాటించండి. గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులను సంతోషంగా స్వీకరించి, సమర్థంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి నిలుపుతారు. భాగస్వాములతో అనుబంధం పెరుగుతుంది.
మకరం
శాస్త్రవేత్తలు, విద్వాంసులకు అనుకూలం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. సమయానికి పనులను పూర్తిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది. ఆర్థికాంశాల్లో తొందరపాటు తగదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
కుంభం
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఏమైనా సమస్యలు వస్తే, వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. విహార యాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు గతంలో కన్నా కొంత అనుకూలం. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు.
మీనం
కొత్త ఉద్యోగంలో చేరతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చును. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులను చేయడంపై మనసు నిలుపుతారు. సాహితీవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి భావనలు పెరుగుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తిచేస్తారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in