సైకిల్‌తో చాలామందికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కానీ, ఒక వయసు వచ్చాక ఆ దోస్తీ దూరమైపోతుంది.
వయసుతోపాటు సైక్లింగ్ ఎక్సర్సైజ్నూ పెంచితే ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు…ఫిట్నెస్ నిపుణులు.
సైక్లింగ్ తేలికైన ఏరోబిక్ వ్యాయామం. శరీరంలోని క్యాలరీలను కరిగించడంలో కీలకంగా పనిచేస్తుంది. శరీర బరువును నియంత్రిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. కండరాలను దృఢపరుస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. వృద్ధులకు, కీళ్ల సమస్యలు ఉన్నవారికి సైక్లింగ్ తేలికైన వ్యాయామం. ఈ రెండు చక్రాల బండి ఆస్టియో ఆర్థరైటిస్ తీవ్రతనూ తగ్గిస్తుంది. సైక్లింగ్ మహిళలకు మరింత ఉపయోగకరం. మానసిక, భావోద్వేగపరమైన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉత్తమ వ్యాయామం. సైక్లింగ్‌తో మనసుకు ఆహ్లాదం లభిస్తుంది. సైక్లింగ్ చేసేవారికి సుఖనిద్ర ఖాయం. ఇదో సులభమైన ప్రక్రియ. పెద్దగా నైపుణ్యమూ అవసరం లేదు. పర్యావరణహితమైంది కూడా.వాహనాల మాదిరిగా శబ్ద, వాయు, జల కాలుష్యం వంటివి ఉండనే ఉండవు.