Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి సూచించారు. ముఖ్యంగా పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉరుకుల పరుగుల జీవితం మధ్య మహిళలు తమ అలసటను పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. అయితే శరీరంలో జరిగే మార్పులను గుర్తించేందుకు కొన్ని రక్త పరీక్షలు ఉపయోగపడతాయని చెప్పారు.
Women | ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి సూచించారు. ముఖ్యంగా పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉరుకుల పరుగుల జీవితం మధ్య మహిళలు తమ అలసటను పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. అయితే శరీరంలో జరిగే మార్పులను గుర్తించేందుకు కొన్ని రక్త పరీక్షలు ఉపయోగపడతాయని చెప్పారు. రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి సంస్థను నడిపించగలిగినా, శరీరాన్ని మాత్రం ఎప్పటికీ అలా నడపలేమని ఆమె పేర్కొన్నారు. కొన్నిసార్లు పరీక్షల నివేదికలు సాధారణంగానే ఉన్నప్పటికీ అలసట, నిద్ర సమస్యలు, ఇతర ఇబ్బందులు కొనసాగుతాయని వివరించారు.
డీహెచ్ఈఏఎస్, ప్రొజెస్టెరాన్..
మొదటిది డీహెచ్ఈఏఎస్ పరీక్ష. తగినంత నిద్రపోయినప్పటికీ అలసట తగ్గకపోతే ఈ పరీక్ష గురించి వైద్యులని సంప్రదించవచ్చని సూచించారు. 35 ఏళ్ల తర్వాత ఈ హార్మోన్ స్థాయిలు ప్రతి ఏడాది సుమారు రెండు శాతం తగ్గుతాయని పేర్కొన్నారు. రెండోది ప్రొజెస్టెరాన్ పరీక్ష. తెల్లవారుజామున నిద్ర మెళకువ రావడం, నెలసరికి ముందు తీవ్రమైన ఆహార కోరికలు కలగడం, నెలసరి ముందు ఇబ్బందులు ఎదురవడం వంటి లక్షణాలున్నప్పుడు ఈ పరీక్షను పరిశీలించాలని చెప్పారు. అయితే అండోత్సర్గం జరిగిన ఏడు రోజుల తర్వాత పరీక్ష చేయించుకోవడం ముఖ్యమని సూచించారు.
కార్టిసాల్, థైరాయిడ్..
మూడోది కార్టిసాల్ పరీక్ష. పగలంతా తీవ్ర అలసటగా ఉండి, రాత్రివేళ మాత్రం నిద్ర రాకుండా ఉత్సాహంగా అనిపిస్తే కార్టిసాల్ స్థాయిల్లో మార్పులు కారణమై ఉంటాయని వివరించారు. ఉదయం ఒక్కసారి పరీక్ష చేయించుకోవడం కంటే, రోజులో నాలుగు వేర్వేరు సమయాల్లో లాలాజల నమూనాలతో చేసే కార్టిసాల్ పరీక్ష స్థాయిలు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని సూచించారు. నాలుగోది థైరాయిడ్ పరీక్ష. కేవలం టీఎస్‌హెచ్ పరీక్షతోనే పూర్తి వివరాలు తెలియవని, అవసరాన్ని బట్టి ఫ్రీ టీ3, ఫ్రీ టీ4 స్థాయిలతోపాటు థైరాయిడ్ యాంటీబాడీలను కూడా పరీక్షించాలని చెప్పారు. హైపోథైరాయిడిజం ఉన్న కొందరు మహిళల్లో హషిమోటోస్ వ్యాధి గుర్తించకుండా ఉంటుందని పేర్కొన్నారు.
ఇన్సులిన్ టెస్ట్..
ఐదోది ఉపవాస సమయంలో ఇన్సులిన్ పరీక్ష. అదుపు చేయలేనంతగా ఆహారం తినాలనే కోరికలు కలుగుతున్నప్పుడు ఈ పరీక్ష గురించి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచించారు. ఉపవాస ఇన్సులిన్ స్థాయి ఐదు కంటే తక్కువగా ఉండడం లక్ష్యంగా పరిగణించవచ్చు. అలాగే దీర్ఘకాలిక రక్త చక్కెర స్థాయిలను అంచనా వేసే హెచ్‌బీఏ1సీ పరీక్షను కూడా గమనించాలని, దాని విలువ 5.3 కంటే తక్కువగా ఉండాలని సూచించారు. అయితే ఈ సంఖ్యలు అందరికీ ఒకే విధంగా వర్తించవు. పరీక్షల ఫలితాలను లక్షణాలు, వైద్య చరిత్ర, వయస్సు వంటి అంశాలతో కలిపి వైద్య నిపుణులు అర్థం చేసుకోవాలి. నిరంతర అలసట లేదా ఇతర లక్షణాలు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్యులని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

