Coffee | లివర్ ఆరోగ్యానికి కాఫీ మేలు చేస్తుందా.. బ్లాక్ కాఫీ వల్ల ఉపయోగాలు ఏమిటి..?
ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా కాలేయ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో బ్లాక్ కాఫీ ఒకటి.
Coffee | ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా కాలేయ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో బ్లాక్ కాఫీ ఒకటి. ఉదయం నిద్రలేవగానే చాలామంది తాగే ఈ పానీయం కేవలం చురుకుదనాన్ని పెంచడానికే కాకుండా కాలేయాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుందని తాజా సమాచారం సూచిస్తోంది. నియమితంగా కాఫీ తాగే వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటంతోపాటు, ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారిలో వ్యాధి పురోగతి నెమ్మదిగా సాగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కాలేయంలో మచ్చలు ఏర్పడే ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా కాఫీ ఉపయోగపడుతుందని వారు వివరిస్తున్నారు.
లివర్ ఫ్రెండ్లీ పానీయం..
కాఫీ కాలేయానికి మేలు చేయడానికి ప్రధాన కారణం ఇందులో ఉండే సహజ సమ్మేళనాలే. ముఖ్యంగా క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడటంతోపాటు జీవక్రియలను మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. శరీరంలోని అన్ని ప్రధాన జీవక్రియలలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు వాపును నియంత్రించడం, జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా మద్దతు ఇస్తాయి. అందుకే బ్లాక్ కాఫీని లివర్-ఫ్రెండ్లీ పానీయంగా పరిగణిస్తారు. అయితే కాఫీ మాత్రమే ఫ్యాటీ లివర్ సమస్యకు పరిష్కారం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మధుమేహం వంటి కారణాలతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయి వాపు, మచ్చలు, తీవ్రమైన సందర్భాల్లో కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. కాబట్టి కాఫీ తాగడం వల్ల మాత్రమే ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గిపోతుందని భావించడం సరైంది కాదు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, మద్యం వినియోగాన్ని తగ్గించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
బ్లాక్ కాఫీ మేలు..
కాఫీ ఎంపిక విషయంలో కూడా జాగ్రత్త అవసరం. పాలు కలపకుండా బ్లాక్ కాఫీ తాగడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక చక్కెర, సిరప్లు, విప్డ్ క్రీమ్ కలిపిన కాఫీ పానీయాలను నివారించాలని సూచిస్తున్నారు. ఇవి బరువు పెరగడానికి, జీవక్రియ సమస్యలకు కారణమై ఫ్యాటీ లివర్ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యవంతులైన పెద్దలు రోజుకు రెండు నుంచి మూడు కప్పుల బ్లాక్ కాఫీ తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కెఫిన్‌కు సున్నితంగా స్పందించే వారు, గర్భిణులు, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు, ఆందోళన సమస్యలు లేదా నిద్రలేమితో బాధపడేవారు, కొన్ని మందులు వాడుతున్నవారు కాఫీ పరిమాణాన్ని పెంచే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కెఫిన్ వినియోగాన్ని తగ్గించాలని భావించే వారికి డీకెఫినేటెడ్ కాఫీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు పరిమిత మోతాదులో బ్లాక్ కాఫీ తీసుకోవడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

