వర్షాకాలం వచ్చిందంటే కూరగాయలు నిల్వ చేయడం చాలా కష్టం. అందులోనూ ఆకుకూరలైతే త్వరగా పాడైపోతాయి. ఆకుకూరలు పోషకాల పవర్హౌస్ లాంటివి. తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. వీటిల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. చాలామంది వారానికి సరిపడా ఆకుకూరలు ఒకేసారి తెచ్చేస్తూ ఉంటారు. ఫ్రిజ్లో పెట్టినా ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉండడం కష్టమే. ఈ టిప్స్ ఫాలో అయితే, ఆకుకూరలను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..