వయసు పైబడే కొద్దీ మెదడులో ఏం జరుగుతుంది?
వయసు మీదపడే కొద్దీ మెదడు కుచించుకుపోతుంది. న్యూరాన్ల సత్తా తగ్గిపోయి, సమాచార వేగం మందగిస్తుంది. దీంతో పాత విషయాలను, పేర్లను, ముఖాలను గుర్తుచేసుకోవడం కష్టంగా మారుతుంది.

వయసు మీదపడే కొద్దీ మెదడు కుచించుకుపోతుంది. న్యూరాన్ల సత్తా తగ్గిపోయి, సమాచార వేగం మందగిస్తుంది. దీంతో పాత విషయాలను, పేర్లను, ముఖాలను గుర్తుచేసుకోవడం కష్టంగా మారుతుంది. వీటికి తోడు జన్యుపరంగా తలెత్తే అల్జీమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలు పరిస్థితిని జటిలం చేస్తాయి. అలాగని వృద్ధాప్యంతో అంతా నష్టమే జరుగుతుందని కాదు. వయసు పెరిగేకొద్దీ మెదడులోని వేర్వేరు భాగాల మధ్య వారధిగా ఉండే ‘డెండ్రైటిస్’ బలపడుతుంది. దానివల్ల ఏదైనా విషయాన్ని సమగ్రంగా ఆకళింపు చేసుకునే నైపుణ్యం అలవడుతుంది. సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్లు, నిదానంగా అవగాహన చేసుకుని.. పరిణతితో పరిష్కరించడానికి కారణం ఇదే!
మలి వయసులోనూ మెదడు చురుగ్గా పనిచేయడానికి కొన్ని ఉపాయాలు లేకపోలేదు. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రేచెల్ వూ’ అనే శాస్త్రవేత్త, వయసు పెరిగే కొద్దీ మనం నేర్చుకునే తీరు కూడా మారాలని చెబుతున్నారు. చిన్నప్పుడు, నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దీన్ని ‘బ్రాడ్ లెర్నింగ్’ అంటారు రేచెల్. కానీ, పెద్దయ్యాక వ్యవహారం ఇలా ఉండదు. కొత్త విషయాన్ని అంగీకరించడానికి స్థిరమైన అభిప్రాయాలు, అహంకారం లాంటివి అడ్డుపడుతూ ఉంటాయి. దీన్ని ‘స్పెషలైజ్డ్ లెర్నింగ్’గా పేర్కొంటారు రేచెల్.
ఈ విధానాన్ని పక్కకు పెట్టి, చిన్నప్పటిలాగానే ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలనేది రేచెల్ సూచన. అప్పుడే, మెదడు మరింత చురుగ్గా ఉంటుందనీ, జ్ఞానం మరింత వృద్ధి చెందుతుందనీ చెబుతున్నారు.బీన్స్, గుడ్లు, టమాట లాంటి పదార్థాల్లో ఉండే ల్యూటెన్ కండ్లకు మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. కండ్లను పరీక్షిస్తే చాలు, శరీరంలో ల్యూటెన్ స్థాయిని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో.. ల్యూటెన్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల మెదడు చాలా చురుగ్గా పనిచేయడాన్ని కూడా గుర్తించారు. ల్యూటెన్ సమృద్ధిగా ఉన్న పెద్దల మెదడు, యువతతో సమానంగా పనిచేయడాన్నీ గమనించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- brain
- Health
- Health news
- oldage
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

