Teachers day | బడిలో మొదటి గంట మోగినప్పటి నుంచి.. ఉపాధ్యాయుల ‘గురు’తరబాధ్యత మొదలవుతుంది. తాము చెప్పే పాఠం చివరి బెంచ్ విద్యార్థికీ వినబడేలా కంఠం పెంచి గొంతు నరాలకు ముప్పు తెచ్చుకుంటారు. క్లాసుక్లాసులో గంటల తరబడి తిరుగుతూ అలసిపోతారు. చాక్‌పీస్ పొడిఊపిరి సలపనివ్వకున్నా.. రాత తప్పదు. ఇన్ని ప్రతికూలతల నడుమ నలభైకి చేరకముందే.. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారినపడుతున్నారు. నడి వయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. పదవీ విరమణకు ముందే స్టంట్లు వేయించుకునే దుస్థితి తెచ్చుకుంటున్నారు. టీచర్లకు కలిగే ఆరోగ్య సమస్యలేంటి? వాటిని తప్పించుకునే మార్గాలేంటో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు సాధారణంగా ఎక్కువసేపు నిలబడి పాఠాలు చెప్పడం, పిల్లల దగ్గరికి వెళ్తూ సందేహాలు తీర్చడం, క్లాసును అదుపు చేసే క్రమంలో తరచూ గట్టిగా అరవడం చేస్తుంటారు. నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అహరహం శ్రమిస్తుంటారు. పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం, పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయడం ఇవన్నీ ఒత్తిడికి గురిచేసేవే! పాఠశాల విధులు, పరీక్షా పత్రాలు తయారు చేయడం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, పాఠ్యాంశ ప్రణాళికలు రాయడం ఇలా చేతినిండా రాతపని ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఇతర ప్రత్యేక సందర్భాల్లో పాఠశాలలో జరిగే కార్యక్రమాల బాధ్యత అదనం. ఇవన్నీ ఉపాధ్యాయుల ఆరోగ్యంపై ప్రభావం చూపేవే! అలుపెరగని ప్రయాణంలో ఉపాధ్యాయులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా… భారీ మూల్యం చెల్లించక తప్పదు.
ఎక్కువ సమయం నిలబడితే
తరగతిలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయులు దాదాపు నిలబడే ఉంటారు. పాఠం చెబుతున్నా.. పరీక్షల వేళ అయినా.. ఏ సమయమైనా.. ఎక్కువ సేపు నిలబడే ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల కాళ్లలో వెరికోస్ వెయిన్స్ అంటే రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
లక్షణాలు
ఎక్కువ సమయం ఒకేచోట కూర్చోవడం
చాలాసేపు కదలిక లేకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల రక్త సరఫరా మందగిస్తుంది. దీంతో రక్తనాళాల్లో క్లాట్ వచ్చే అవకాశం ఉంది. అంటే డీవీటీ (డీప్ వెయిన్ థ్రాంబోసిస్) ప్రమాదం ఏర్పడుతుంది.
పరిష్కారం
ఒకేచోట ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి అటూ ఇటూ నడవాలి. వీలుంటే క్లాసులో నడుస్తూ పాఠం చెప్పాలి. దీనివల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది.
ఎక్కువ సేపు మాట్లాడటం
ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు పాఠాలు బోధించాల్సిన క్రమంలో ఎక్కువ సమయం మాట్లాడాల్సి ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు గొంతు బొంగురుపోవచ్చు. దీనినే వైద్య పరిభాషలో సోర్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. కొంతమందిలో స్వర పేటికలో కూడా నాడ్యుల్స్ అంటే చిన్నపాటి బుడగల్లా రావచ్చు. వీటిని టీచర్స్ నాడ్యుల్స్ అని కూడా అంటారు.
లక్షణాలు
పరిష్కారం
అదేపనిగా పాఠం చెప్పకుండా మధ్యలో గొంతుకు కాస్త విరామం ఇవ్వాలి. టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ ఏర్పడి గొంతు బొంగురుపోతుంది. అందుకని టీ, కాఫీలు తగ్గించడం మంచిది.
ఒత్తిడి
సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగే వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా బరువు పెరగడం, ఊబకాయం సమస్యలూ తలెత్తవచ్చు. బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోతే ఆ ప్రభావం గుండె, కిడ్నీ వ్యాధులకు దారితీయొచ్చు. ముఖ్యంగా ఒత్తిడి వల్ల హృద్రోగ సమస్యలు రావచ్చు.
పరిష్కారం
బయటి తిండి
వృత్తిరీత్యా తీరిక లేకపోవడం వల్ల కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ఆకలి, సమయం లేకపోవడం వల్ల అందుబాటులో ఎలాంటి ఆహారం ఉంటే దాన్ని తినేస్తుంటారు. దీనివల్ల కామెర్లు, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తగ్గించుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఊబకాయం, బరువు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉండే ఆహారం తీసుకోవాలి.
కంటికి విశ్రాంతి లేకపోవడం
పుస్తక పఠనం, కంప్యూటర్ చూడటం వల్ల కండ్లు పొడిబారుతాయి. సమస్యను గుర్తించకపోతే చూపు మందగించవచ్చు. అంతేకాకుండా తలనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
పరిష్కారం
చాక్‌పీస్ వాడకం వల్ల
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఇది ప్రధాన సమస్య. చాక్‌పీస్ పట్టకుండా పాఠాలు చెప్పడం కష్టం. బోర్డు మీద చాక్‌పీస్‌తో రాస్తున్నప్పుడు, బోర్డు తుడిచేటప్పుడు సుద్దముక్క దుమ్మంతా శరీరంపై పేరుకుపోతుంది. నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్తుంది. దీంతో కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి చర్మ సంబంధ రుగ్మతలు రావచ్చు. శ్వాస సమస్యలు, జలుబు, తుమ్ములు, దగ్గు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
పరిష్కారం
డస్ట్లెస్ చాక్‌పీస్‌లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని వాడటం మంచిది. బోర్డు తుడిచేటప్పుడు దుమ్ము పైకి రాకుండా జాగ్రత్తపడాలి. ముక్కుకు వస్త్రం అడ్డం పెట్టుకొని బోర్డు తుడవాలి. మార్కర్‌తో రాసే బోర్డులు, డిజిటల్ బోర్డులు వినియోగించే ప్రయత్నం చేయండి.
…?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ శివరాజు
సీనియర్ కన్సల్టెంట్
ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్