Black Sesame | నువ్వులు రెండు రకాలు.. తెల్ల నువ్వులు.. నల్ల నువ్వులు ఉంటాయి. నువ్వులతో పలు రకాల వంటకాలు తయారు చేయొచ్చు. వీటిల్లో నల్ల నువ్వుల్లో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పౌష్టిక పదార్థాలు ఉంటాయి. నల్లనువ్వులు వాడటంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. జట్టుకు, చర్మానికి ప్రయోజనం లభిస్తుంది. నల్ల నువ్వులతో ఒనగూడే బెనిఫిట్ల గురించి తెలుసుకుందామా..!
నల్ల నువ్వుల్లో పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగినంత పరిణామంలో ఉంటాయి. నల్లనువ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధ వ్యాధుల ముప్పు నివారించొచ్చు. మనుష్యుల్లో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సాయ పడతాయి. వీటిల్లోని కాల్షియం, కాపర్, మాంగనీస్, ఐరన్, బీ6 విటమిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడటంతోపాటు రోగాల బారీన పడకుండా కాపాడతాయి.
రోజువారీ ఆహారంలో నల్ల నువ్వుల్ని చేర్చుకోవడంతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గించుకోవచ్చు. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. నువ్వుల్లోని పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగినంత పరిణామంలో ఉండటంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలకంగా ఉంటాయి.