Health Tips | ఈ ఆహారంతో మలబద్ధకం, అజీర్తి సమస్యలకు చెక్
చలికాలంలో వేడివేడిగా ఇష్టమైన ఆహార పదార్ధాలను తీసుకోవడంతో పాటు పండగ సీజన్ కావడంతో పలు వంటకాలను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజన్లో (Health Tips) కడుపుబ్బరం, వికారం, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి.
న్యూఢిల్లీ : చలికాలంలో వేడివేడిగా ఇష్టమైన ఆహార పదార్ధాలను తీసుకోవడంతో పాటు పండగ సీజన్ కావడంతో పలు వంటకాలను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజన్లో (Health Tips) కడుపుబ్బరం, వికారం, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. అధికంగా షుగర్, ఆల్కహాల్ వినియోగం కూడా ఈ సమస్యలను మరింత జటిలం చేస్తుంది. అనారోగ్యకర ఆహారం అధికంగా తీసుకోవడం ద్వారా ప్రేవుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గడం పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నట్స్, బీన్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం ప్రేవుల్లో ఆరోగ్యకర బ్యాక్టీరియా పెరిగేందుకు దారితీస్తుంది.
ఈ ఆహారపదార్ధాలతో పాటు తగినంత నీరు తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చని ప్రేవుల కదలిక మెరగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేవుల ఆరోగ్యం మెరుగుపడేందుకు పెరుగు, మజ్జిగ వంటి పులిసిన ఆహార పదార్ధాలను డైట్లో భాగం చేసుకోవాలి. ఇంకా భోజనాన్ని బాగా నమిలిమింగడాన్ని కూడా అలవరుచుకోవాలి. వీటితో పాటు మితాహారం తీసుకుంటూ తగినంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
Read More :
Heart Health | ఈ ఆహారంతో హృదయం పదిలం..8 వారాల్లో మెరుగైన ఫలితాలు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

