Vitamin-D | విటమిన్-డి లోపం నుంచి బయటపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
నిజానికి విటమిన్-డి అన్నది ఆహారం కంటే సూర్యరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. సూర్యకిరణాలు చర్మంపై పడినప్పుడు శరీరంలోని ఒక రకం కొవ్వులు విటమిన్-డిని తయారు చేస్తాయి. సూర్యరశ్మిలోని యూవీ-బి కిరణాలు ఈ ప్రక్రియకు ఉపకరిస్తాయి.
Vitamin-D | ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో విటమిన్-డి లోపం కనిపిస్తున్నది. దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. జీవనశైలిలో చేసు కోవాల్సిన మార్పులేమిటి?
- ఓ పాఠకురాలు
నిజానికి విటమిన్-డి అన్నది ఆహారం కంటే సూర్యరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. సూర్యకిరణాలు చర్మంపై పడినప్పుడు శరీరంలోని ఒక రకం కొవ్వులు విటమిన్-డిని తయారు చేస్తాయి. సూర్యరశ్మిలోని యూవీ-బి కిరణాలు ఈ ప్రక్రియకు ఉపకరిస్తాయి. ఎక్కువ పనివేళలు, నిత్యం వాహనాల్లో ప్రయాణం, నాలుగు గోడల మధ్యే గడపడం మొదలైన కారణాల వల్ల విటమిన్-డి లోపం ఉన్నవారి సంఖ్య అధికం అవుతున్నది. దీని లోపం వల్ల ఎముకలు బలహీన పడతాయి. క్యాల్షియం, ఫాస్పరస్‌లాంటి ఎముకలకు అవసరమైన పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఈ లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. గుండె కండరాల సంకోచ వ్యాకోచాలు జరగాలన్నా, మెదడు నుంచి మిగతా శరీర భాగాలకు సంకేతాలు అందాలన్నా
విటమిన్-డి అవసరం. ఇది చర్మం ద్వారానే తయారవుతుంది కనుక, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
తల్లిదండ్రుల్లో లోపం ఉంటే పిల్లలూ ఇదే లోపంతో పుడుతున్నారు. కొన్నిసార్లు ఆటిజం, ఏడీహెచ్డీలాంటి డిజార్డర్లకు కారణం అవుతుంది. అయితే, వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రోజుకు పదిహేను నిమిషాలు ఎండలో కూర్చుంటే చాలు. శరీరం తగినంత విటమిన్-డిని తయారు చేసుకుంటుంది. ఇందుకోసం ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య సమయాన్ని ఎంచుకోవచ్చు. చర్మం మీద నేరుగా సూర్యరశ్మి పడితేనే తయారవుతుంది కనుక సాధ్యమైనంత ఎక్కువ భాగం శరీరానికి ఎండ నేరుగా తగిలేలా చూసుకోవాలి. ఇక ఆహారం ద్వారా తీసుకోవాలంటే.. పాలు, పాల పదార్థాలలో దొరుకుతుంది. సోయాలో కూడా కొద్ది మొత్తంలో లభిస్తుంది. చేపలు, గుడ్డు, పుట్టగొడుగులో ఉంటుంది. డి-విటమిన్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌ను తీసుకున్నా మేలే. పాలు, యోగర్ట్లాంటివి ఈ తరహాలో దొరుకుతున్నాయి. ఈ విటమిన్ లోపిస్తే.. ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుని.. అవసరమైతే సప్లిమెంట్లు తీసుకోవాలి.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

