Vitamin C | సీ విటమిన్‌తో ఇమ్యూనిటీ మాత్రమే కాదు.. హుషారూ.. సంతోషం కూడా..!
Vitamin C | సీ విటమిన్ వాడకంతో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు మనిషిలో హుషారు, ఉత్సాహం ఎక్కువ అవుతాయి.
Vitamin C | విటమిన్లతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.. రోగ నిరోధక శక్తి ఎక్కువ. వాటిల్లో `సీ` విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పుంజుకోవడంతోపాటు ప్రతి ఒక్కరి మానసిక శక్తిని మెరుగు పరుస్తుంది. వారిలో హుషారు, ఉత్సాహం పెంపొందిస్తుంది. `సీ` విటమిన్‌ను సంతోష రసాయనం అని కూడా పిలుస్తుంటారు. మెదడులోని నాడీ సమాచార వాహికల ఉత్పత్తికి `సీ` విటమిన్ చాలా అవసరం.. నాడీ సమాచార వాహికల ఉత్పత్తికి ఉపకరిస్తుంది. వాటిల్లో డొపమైన్ అనే సమాచార వాహిక మనిషిలో సంతోషం, ఉత్సాహం కలిగిస్తుంది. తగినంత మోతాదులో `సీ` విటమిన్ లేకపోతే డోపమైన్ మోతాదు పడిపోయి.. హుషారు కూడా తగ్గిపోతుంది.
అంతే కాదు.. నార్ ఎపినెఫ్రిన్ అనే మరో నాడీ సమాచార వాహికగా మార్చడంలోనూ డోపమైన్ భాగస్వామిగా ఉంటుందని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి. డోపమైన్తోపాటు నారిఎఫినెఫ్రిన్ మోతాదు తగ్గినా, నిరాశ, ఆందోళన తలెత్తి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. అంతే కాదు ఈ రెండు సమాచార వాహికలు మెదడులో వాపు రాకుండా చూస్తాయి. ఈ నేపథ్యంలోనే మెదడులో వాపు నివారణకు మానసిక వైద్యులు, నిపుణులు ఎక్కువగా చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే మన మెదడుకి, పేగులకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. పేగుల్లో వాపును నివారిస్తే.. మెదడుపై ప్రభావం పడదు. పేగుల్లో వాపు నివారించడానికి `సీ` విటమిన్ దోహద పడుతుంది. పేగుల్లో వాపు నుంచి కోలుకోవాలంటే ఎక్కువ శక్తి కావాలి. సీ విటమిన్ వల్ల కేలరీలు ఎక్కువ రాకపోయినా శక్తి పెరుగుతుంది. నిరాశానిస్పృహలకు గురవుతున్న వారు, కుంగుబాటు సమస్యలు ఎదుర్కొంటున్న వారు సీ విటమిన్ లభించే పదార్థాలు తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజూ ప్రతి ఒక్కరు 65 మిల్లీ గ్రాముల నుంచి 90 మిల్లీ గ్రాముల `సీ` విటమిన్ తీసుకోవాలి. నారింజ, బత్తాయి, నిమ్మ పండ్లు, క్యాప్సికం, బ్రకోలీ వంటి వాటిల్లో ఈ విటమిన్ ఫుష్కలంగా ఉంటుంది. నారింజ పండులో 82 మిల్లీ గ్రాములు, ఎర్ర క్యాప్సికంలో 342 మిల్లీ గ్రాములు, బ్రకోలీలో 89 మిల్లీ గ్రాముల సీ విటమిన్ లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

