Vitamin C For Women | మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. ఇది విటమిన్ల జాబితాకు చెందుతుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. విటమిన్ సి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే విటమిన్ సి స్త్రీలు, పురుషులకు వేర్వేరు లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు విటమిన్ సి ఎంతగానో దోహదం చేస్తుంది. స్త్రీలు కచ్చితంగా విటమిన్ సి ఉన్న ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు. విటమిన్ సి నీటిలో కరిగే పోషక పదార్ధం. దీన్ని శరీరం నిల్వ చేసుకోలేదు. కనుక రోజూ విటమిన్ సి అందేలా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు విటమిన్ సి లభించేలా జాగ్రత్త పడాలి. దీని వల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. మహిళలు రోజూ తగినంత విటమిన్ సి లభించేలా చూసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
విటమిన్ సి వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మహిళలకు రోగ నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. కనుక వారు రోజూ విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ సి సరిగ్గా లభించకపోతే స్త్రీలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ సి ఉన్న ఆహారాలను రోజూ తింటుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల మహిళల చర్మం సురక్షితంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. గర్భిణీలు విటమిన్ సి ఉండే ఆహారాలను తింటుంటే శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
మహిళలు సహజంగానే నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. దీని వల్ల నెలసరి సమస్యలు వస్తుంటాయి. రుతుక్రమం సరిగ్గా అవదు. దీని వల్ల సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కానీ విటమిన్ సి ఉండే ఆహారాలను రోజూ తింటుంటే ఈ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టవచ్చు. అలాగే హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక పురుషుల కన్నా స్త్రీలలోనే రక్తహీనత సమస్య ఎక్కువగా వస్తుంది. కనుక వారు విటమిన్ సి ఉండే ఆహారాలను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. విటమిన్ సి వల్ల ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఐరన్ లభిస్తుంది. రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
విటమిన్ సి ఉండే ఆహారాలను తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. విటమిన్ సి వల్ల స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల హార్మోన్ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉండవు. రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇలా స్త్రీలకు విటమిన్ సి ఎంతో మేలు చేస్తుంది. కనుక వారు విటమిన్ సి ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. ఇక 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బాలికలకు రోజూ 66 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సి అవసరం అవుతుంది. అదే 16 నుంచి 18 ఏళ్ల యువతులకు అయితే 68 మిల్లీగ్రాములు, 18 ఏళ్ల వయస్సు మించిన వారికి రోజుకు 65 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సి అవసరం అవుతుంది. టమాటాలు, కివీలు, క్యాబేజీ, నారింజ, నిమ్మ, ఉసిరికాయలు, క్యాప్సికం, అరటి పండ్లు, అన్ని రకాల బెర్రీలు, పైనాపిల్, జామ కాయలు, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, పచ్చి బఠానీలు, మామిడి కాయలు వంటి ఆహారాల ద్వారా విటమిన్ సి ని అధికంగా పొందవచ్చు.