Hair Fall | జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారికి మేలు చేసే ఆయుర్వేద మూలికలు ఇవే.. ఎలా వాడాలంటే..
జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మార్కెట్లో లభించే అనేక హెయిర్ ట్రీట్మెంట్లు ఉపయోగించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోతే, సహజ పద్ధతుల వైపు మొగ్గు చూపడం మంచిదని ఆయుర్వేదం సూచిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో పిత్త దోషం పెరగడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది.
Hair Fall | జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మార్కెట్లో లభించే అనేక హెయిర్ ట్రీట్మెంట్లు ఉపయోగించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోతే, సహజ పద్ధతుల వైపు మొగ్గు చూపడం మంచిదని ఆయుర్వేదం సూచిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో పిత్త దోషం పెరగడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. శరీరంలో అధిక వేడి, ఒత్తిడి, అసమతుల్య జీవనశైలి కారణంగా జుట్టు బలహీనపడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని సహజ మూలికలు, నూనెలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. పిత్త దోషాన్ని నియంత్రించేందుకు ధూమపానం, మద్యం, అధికంగా కాఫీ, టీ సేవించడం తగ్గించాలి. అలాగే పుల్లని ఆహారాలను పరిమితంగా తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
జోజోబా ఆయిల్, అశ్వగంధ..
జోజోబా ఆయిల్ జుట్టు సంరక్షణలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ఇది తలకు పోషణ అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా జోజోబా ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, నిద్ర నాణ్యత మెరుగుపడటంతోపాటు జుట్టు మూలాలు బలపడతాయి. అశ్వగంధ పిత్త దోషాన్ని సమతుల్యం చేసే ముఖ్యమైన ఔషధ మూలికగా గుర్తింపు పొందింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఉసిరికాయను జుట్టు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన సహజ పదార్థంగా భావిస్తారు. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఉసిరి పొడిని మెంతుల పొడి, బ్రాహ్మి పొడితో కలిపి పెరుగులో మిశ్రమంగా తయారు చేసి జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవచ్చు. గంటకు పైగా ఉంచి తేలికపాటి షాంపూతో కడిగితే జుట్టు మెత్తగా మారడమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
జటమాంసి, బాదంనూనె..
జటమాంసి అనేక హెయిర్ టానిక్‌లలో ఉపయోగించే మూలిక. ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి జుట్టు మూలాలను పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. తల చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. బాదం నూనెలో జటమాంసి వేరును కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ, బలంగా మారుతుంది. చుండ్రు, తల చర్మ ఇన్ఫెక్షన్లు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని వడకట్టి షాంపూ చేసిన తర్వాత తలకు పోస్తే చుండ్రు తగ్గి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. వేప నూనెతో మసాజ్ చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
భృంగరాజ్..
భృంగరాజ్‌ను ఆయుర్వేదంలో మూలికల రాజుగా పరిగణిస్తారు. ఇది జుట్టు మళ్లీ పెరగడానికి తోడ్పడుతుంది. భృంగరాజ్ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయడం లేదా భృంగరాజ్ నూనెతో తలకు మసాజ్ చేసి రాత్రంతా ఉంచడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడటంతోపాటు జుట్టు మరింత మెరిసేలా మారుతుంది. జుట్టు రాలడానికి పోషకాహార లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి సమస్య ఎక్కువకాలం కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

