World Liver Day | కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..!
World Liver Day : కాలేయ వ్యాధుల పట్ల అవగాహన పెంచి మన లివర్ హెల్త్‌ను మెరుగుపరిచేందుకు ఏటా ఏప్రిల్ 19ని వరల్డ్ లివర్గా డేగా పాటిస్తుంటారు.
World Liver Day : కాలేయ వ్యాధుల పట్ల అవగాహన పెంచి మన లివర్ హెల్త్‌ను మెరుగుపరిచేందుకు ఏటా ఏప్రిల్ 19ని వరల్డ్ లివర్గా డేగా పాటిస్తుంటారు. శరీరం నుంచి వ్యర్ధాలను లివర్ తొలగించి శరీరంలో ఆరోగ్యకర బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నిర్వహించడంతో పాటు రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుందని కొలంబియా యూనివర్సిటీ సర్జరీ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో పేర్కొంది. లివర్ 500కుపైగా భిన్నమైన కీలక విధులను నిర్వర్తించి కష్టపడే అవయవమని అమెరికన్ లివర్ ఫౌండేషన్ఠ వివరించింది. లివర్ కంటే కేవలం మెదడు మాత్రమే అధిక విధులను నిర్వర్తిస్తుంది.
శరీరంలో జీవక్రియలకు సంబంధించిన విధులను లివర్ అధికంగా నిర్వర్తిస్తుండటంతో మనం తీసుకునే ఆహారం లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అధిక షుగర్, వేపుడు పదార్ధాలు, మద్యం, ప్రాసెస్ చేసిన మాంసం వంటి ఆహార పదార్ధాలు అధికంగా తీసుకుంటే లివర్ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆహారం అతిగా తీసుకుంటే ఫ్యాలీ లివర్ వ్యాధి బారినపడే ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
చక్కెరతో కూడిన పానీయాలను అధికంగా తీసుకుంటే కాలేయంపై భారం తీవ్రమవతుందని, ఆపై కొవ్వును అది నిల్వ చేసుకునే క్రమంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) బారినపడే అవకాశం ఉందని యోగ, లైఫ్‌స్టైల్ నిపుణులు నమిత చంద్ర చెబుతున్నారు. అతిగా ఏం తీసుకున్నా చివరికి గ్లూకోజ్ అయినా ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుందని, మరో రకమైన చక్కెర ఫ్రక్టోజ్ కూడా పలు కారణాలతో లివర్‌కు హానికారకమేని అన్నారు. ఆహారపదార్ధాలకు రుచి పెంచే ఫ్రక్టోజ్‌తో మరింత ముప్పు ఉంటుందని చెప్పారు. ఇక పండ్లలోనూ ఫ్రక్టోజ్ ఉండటంతో వీటిని పరిమితంగా తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్, వేపుళ్లు, షుగర్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ మాంసం, మద్యం వంటివి మితంగా తీసుకుంటూ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నమిత సూచించారు.
Read More :
Google CEO | గూగుల్ కార్యాలయం రాజకీయాలకు వేదిక కాదు : ఉద్యోగులకు సీఈవో వార్నింగ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

