ప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్. చిన్న ప్రేగు, అన్నవాహిక, కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థలోని పెద్దపేగు లోపలి వైపు వాపు వచ్చినా, మ్యూకస్ పొర దెబ్బ తిన్నా అల్సరేటివ్ కొలైటిస్గా పరిగణిస్తారు. నీరు తక్కువ తాగడం వల్లనో లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి ఒక్కరూ జీవిత కాలంలో ఏదో ఒక దశలో అల్సర్‌కు గురవడం జరుగుతుంది.
ఆరంభంలో దీని లక్షణాలు కనిపించకపోయినా వ్యాధి క్రమంగా ముదిరేకొద్దీ లక్షణాలు క్రమేపీ బయటపడతాయి. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, అలసట, జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత, ఆకలి లేకపోవడం, రక్తంతో కూడిన విరేచనాలు, లివర్ సమస్యలు, డీ హైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జీర్ణశయం అల్సర్ వచ్చిన సందర్భాల్లో బాగా మంటతో కూడిన నొప్పి, అన్నం తింటూనే ఎక్కువై 3,4 గంటల తర్వాత తగ్గుతుంది. అన్నం సహించకపోవడం, ఆకలి మందగించడం, వాంతులు అవడం, బరువు తగ్గడం, వాంతి అయిన సందర్భాల్లో కడుపులో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డ్యుయోడినల్ అల్సర్స్ కనిపించినప్పుడు కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నొప్పి అధికమవుతుంది. అన్నం తిన్న 2,3 గంటలు దాటిన తర్వాత.. అర్ధరాత్రి, తెల్లవారు జామున ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది.
అయితే ఈ వ్యాధి కచ్చితంగా ఎందుకు వస్తుందో వైద్యులు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. అయితే, ఈ వ్యాధి జన్యు పరంగా లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావం, జీవనశైలిలో మార్పులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ల కారణంగా వస్తుందని వైద్యులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చిన వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ.. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ కచ్చితమైన డైట్ పాటించాలి. పలు సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే అల్సరేటివ్ కొలైటిస్ నుంచి బయట పడవచ్చు.
నివారణ ఇలా..