Nepal Flash Floods: విదేశాల రెస్క్యూ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్
Nepal Flash Floods: నేపాల్‌కు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే తమకు ఎటువంటి సహాయం అవసరం లేదని నేపాల్ విదేశాంగశాఖ పేర్కొన్నది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్థిక సహకారాన్ని ఆశిస్తున్నట్లు చెప్పింది.
కాట్మాండు: జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్(Nepal Flash Floods)కు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే తమకు ఎటువంటి సహాయం అవసరం లేదని నేపాల్ పేర్కొన్నది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిరస్కరించింది. తమ స్వంత భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే సామర్థ్యం ఉన్నట్లు నేపాల్ వెల్లడించింది. బుధవారం సంభవించిన బురద, వరద విలయం వల్ల అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అయితే బోటెకోసి, త్రిశూలీ నది పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
రెస్క్యూ ఆపరేషన్ కోసం అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయని, కానీ ఆ అభ్యర్థనలను తిరస్కరించినట్లు నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది. నేపాలీ సెక్యూర్టీ దళాలే సెర్చ్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలను తిరస్కరించినట్లు నేపాల్ చెప్పింది.
అయితే విదేశీ సహాయ బృందాలకు బదులుగా .. ఆర్థికసాయాన్ని నేపాల్ కోరుతోంది. పునర్నిర్మాణ దశలో అంతర్జాతీయ సహాయాన్ని కోరనున్నట్లు నేపాల్ చెప్పింది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 469కి చేరుకున్నది. టిబెట్‌లో మళ్లీ వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ను చైనా నిలిపివేసింది. 10 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు శ్రీలంక ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

