Black Hair | ప్రస్తుతం చాలా మందికి అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో జుట్టు తెల్లబడడం కూడా ఒకటి. సాధారణంగా వయస్సు మీద పడిన వారికి ఇలా జరుగుతుంది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారి జుట్టు కూడా తెల్లబడుతోంది. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలికంగా మందులను వాడడం, మద్యం అధికంగా సేవించడం, పొగ తాగడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి జుట్టు త్వరగా తెల్లబడుతోంది. ఈ సమస్య ఉన్నవారు ఖరీదైన చికిత్సలు తీసుకుంటారు. కానీ ఆ అవసరం లేదు. మనకు అందుబాటులో ఉండే పలు రకాల పదార్థాలను వాడడం వల్ల సహజసిద్ధంగానే జుట్టు నల్లగా మారుతుంది. తెల్లగా ఉన్న జుట్టును సులభంగా నల్లగా మార్చుకోవచ్చు. పైగా ఇతర జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి.
తెల్లగా ఉన్న శిరోజాలను నల్లగా మార్చేందుకు గాను బ్లాక్ టీ ఎంతగానో సహాయం చేస్తుంది. ఇందుకు గాను బ్లాక్ టీని తయారు చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు బాగా పట్టించాలి. జుట్టుకు బాగా మర్దనా చేయాల్సి ఉంటుంది. ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లకు బాగా తగిలేలా సున్నితంగా మర్దనా చేయాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ పాటిస్తుంటే తెల్లగా ఉన్న శిరోజాలు నల్లగా మారుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఉసిరికాయల రసం, కొబ్బరినూనెలను బాగా కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
కొబ్బరినూనెను కాస్త వేడి చేసి అందులో కొద్దిగా ఉసిరిక పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. 60 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తున్నా కూడా సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. గోరింటాకు కూడా జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. గోరిటాంకు పొడి లేదా హెన్నాలో కొద్దిగా పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ డికాషన్, తులసి ఆకుల రసం, పుదీనా ఆకుల రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఉడికించాలి. రాత్రంతా దీన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని తలకు రాయాలి. 1 గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను తరచూ పాటిస్తుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. దీని వల్ల జుట్టు నల్లబడడమే కాదు అన్ని రకాల జుట్టు సమస్యలు తొలగిపోయి శిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.
కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులను వేసి బాగా మరిగించాలి. ఆకులు నల్లగా మారే వరకు మరిగించిన తరువాత ఆ మిశ్రమాన్ని చల్లార్చి వడకట్టాలి. అనంతరం దాన్ని సీసాలో నిల్వ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట తలకు పట్టించాలి. మరుసటి రోజు తలస్నానం చేసి కడిగేయాలి. లేదా మిశ్రమాన్ని తలకు పట్టించిన తరువాత 2 గంటలు ఆగి కూడా తలస్నానం చేయవచ్చు. ఇలా చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. శిరోజాలు నల్లగా మారి ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల సహజసిద్ధంగానే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీంతోపాటు అన్ని రకాల జుట్టు సమస్యలు సైతం తొలగిపోతాయి.