న్యూఢిల్లీ : అధిక బరువు తగ్గడం గురంచి మాట్లాడిన ప్రతిసారీ మొదటిగా డైటింగ్ ఆలోచన మెదులుతుంది. కీటో డైట్ నుంచి తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారంపై కసరత్తు సాగిస్తుంటారు. అయితే తమకు సరిపడే సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకుని అదనపు కిలోలు తగ్గేవరకూ దాన్ని పాటించే వారు అరుదుగా ఉంటారు.
ప్రతి సమస్యకూ పలు పరిష్కారాలు ఉన్నట్టే అధిక బరువు తగ్గేందుకూ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. రోజూ శారీరక వ్యాయామాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ నిపుణుల సూచనలను ఆచరిస్తూ బరువు తగ్గవచ్చు. వైద్య నిపుణులు చెబుతున్న ఈ సూచనలను పాటించి మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు.
సమతుల ఆహారంతో శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందించవచ్చు
పొగతాగడం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
చక్కెర అధికంగా ఉండే పానీయాలకు బదులు కొబ్బరి నీరు, టీ వంటి డ్రింక్స్ తీసుకోవాలి
నిత్యం శారీరక వ్యాయామంతో పాటు వైద్యుల సలహాలు పాటించాలి