గర్భాశయ ఆరోగ్యం కోసం..

మహిళల శరీరంలో గర్భాశయం కీలక పాత్ర పోషిస్తుంది. నెలసరి సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్ తదితర ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలి. ఆ ప్రయత్నంలో ఆహారమూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కెఫిన్ పదార్థాలు మితిమీరితే అబార్షన్, ప్రసవ సమస్యలు పెరుగుతాయి. క్యాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. క్యాల్షియం ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి తోడ్పడుతుంది. ఫైబ్రాయిడ్స్‌ను తగ్గించేందుకూ సాయపడుతుంది. అయితే, శరీరం క్యాల్షియంను శోషించుకునేందుకు తగినంత విటమిన్-డి అవసరం. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు చిరునామా అయిన నట్స్, సీడ్స్ గర్భాశయ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ, క్యాబేజీ, కివీ, జామ, బ్రొకోలీ, క్యాప్సికం రోగనిరోధక శక్తిని పెంచుతాయి, గర్భాశయ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు, వీట్ బ్రెడ్ మొదలైనవి ఫైబ్రాయిడ్ ట్యూమర్లను నియంత్రిస్తాయి. ఇలా ఆహార విధానంలో మార్పులు చేసుకోవడంతో పాటు.. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ధ్యానం, యోగా, చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

