డయాబెటిస్.. చాప కింది నీరులా మెల్లగా మనల్ని చుట్టేస్తున్న భయంకర వ్యాధి. మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి మనలో ఈ వ్యాధి కనిపించిందంటే.. ఇక ఆ వ్యాధిని నిర్మూలించడం సాధ్యం కాదు. అదుపులో పెట్టుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గం. ఈ వ్యాధి మనకు రాకుండా ఉండేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. అయితే, కొన్ని లక్షణాలను గుర్తించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు ముందే గుర్తించవచ్చు.
డయాబెటిస్ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. చిన్న వయస్సులోనే చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మనలో కనిపించడం మొదలుకాగానే అనేక భాగాలను దెబ్బతినడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ కారణంగా కళ్ళు బలహీనంగా మారవచ్చు. మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. ఇదే సమయంలో చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు.
మన శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా మూత్రవిసర్జన మొదలవుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌తో పాటు పొడి చర్మం సమస్య ఏర్పడుతుంది. ఈ వ్యాధి నిర్ధారణకు ముందే మన చర్మంపై కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను సూచిస్తాయి. ఇటువంటి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే డయాబెటిస్‌ను నివారించుకోవచ్చు.
గొంతు లేదా చంకల్లో నల్లటి ప్యాచెస్ ఏర్పడుతాయి. వీటిని చేతితో తాకినప్పుడు వెల్వెట్ మాదిరిగా అనిపిస్తాయి. ఇవి మధుమేహం రావడానికి ముందు లక్షణాలు. ఈ లక్షణం కనిపించింది అంటే మీ రక్తంలో ఇన్సులిన్ పెరిగినట్లు సంకేతంగా భావించాలి.
చర్మంపై దురద లేదా నొప్పి లేదా చర్మంపై పెరిగిన మొటిమలు కనిపిస్తాయి. తర్వాత మొల్లమెల్లగా పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి కూడా మధుమేహానికి ముందస్తు సూచికలే. దీని కోసం షుగర్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. చర్మ వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు కూడా తీసుకోవాలి.
ఒక వ్యక్తి రక్తంలో చక్కెరల స్థాయి చాలా కాలం పాటు ఎక్కువగా ఉన్నట్లయితే.. నరాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. రక్త ప్రసరణలో సమస్యలు కూడా వస్తాయి. నరాలు దెబ్బతినడం వల్ల చర్మంపై ఏదైనా గాయమైతే త్వరగా నయం కాదు. ఇలాంటి సమస్య కనిపించగానే వెంటనే డాక్టర్ని కలువాలని గుర్తించాలి.
ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’
చిన్నారిని చంపేసిన ఆన్లైన్ చదువు
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..