న్యూఢిల్లీ : మనలో చాలామందికి టీ (Tea) తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయాన్నే గరం గరం ఛాయ్‌తో గొంతు తడపనిదే ఏ పనిలోనూ పడలేం. టీని ఆస్వాదించేవారు తేనీరు లేనిదే తమకు పొద్దుపోదు అంటుంటారు. కోల్డ్, బ్లాక్, గ్రీన్, జింజర్ ఇలా ఏ రకమైనా టీ తీసుకున్నా అది టేస్ట్‌తో పాటు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
టీతో రోగనిరోధక వ్యవస్ధ బలోపేతమవుతుందని న్యూట్రిషనిస్ట్ అంజూ సూద్స్ పేర్కొన్నారు. హానికారక ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాలను కాపాడే యాంటీఆక్సిడెంట్లు టీలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. రోజూ టీ తాగేవారిలో హృద్రోగ ముప్పు తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీ తాగడంతో ట్రైగ్లిజరైడ్లు తక్కువగాఉంటాయని, గుండె ఆరోగ్యానికి మేలు చేసే హెచ్‌డీఎల్ లెవెల్స్ పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
నిత్యం టీ తాగితే మెదడు పనితీరు మెరుగవుతుందని జర్నల్ ఏజింగ్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. రోజూ టీ తాగితే చర్మ సౌందర్యం పెరుగుతందని, టీలో ఉండే వాపు నివారణ పదార్ధాలతో చర్మంలో వాపులు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. వారంలో ఒకటిరెండు సార్ల కంటే ఎక్కువగా టీ తాగేవారు బరువు తగ్గుతారని, ఫిట్నెస్ గోల్స్‌ను చేరుకుంటారని పోషకాహార నిపుణులు రూపాలి దత్తా పేర్కొన్నారు.
Read More :