Road accident | స్కూటీని ఢీకొట్టిన కారు.. రెండు ముక్కలైన స్కూటీ.. మహిళకు తీవ్ర గాయాలు
Road accident | స్కూటీపై రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ విరిగిపోయి ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఎగిరిపడ్డాయి. ఆ స్కూటీపై వెళ్తున్న మహిళ ఎగిరి గాయాలతో పక్కన పడిపోయింది.
న్యూఢిల్లీ: స్కూటీపై రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ విరిగిపోయి ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఎగిరిపడ్డాయి. ఆ స్కూటీపై వెళ్తున్న మహిళ ఎగిరి గాయాలతో పక్కన పడిపోయింది. అయినా, కారు డ్రైవర్ ఆపకుండా అదే వేగంతో పారిపోయాడు. ఈ ప్రమాదం దృశ్యాలను రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారు ఢీకొట్టి వెళ్లిపోగానే తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న మహిళను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

