Coffee | రోజూ కాఫీని పరిమిత మోతాదులో సేవిస్తే లాభాలే.. వెల్లడిస్తున్న వైద్య నిపుణులు..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాల్లో కాఫీ ఒకటి. సాధారణంగా కాఫీని నిద్రలేమి, ఆందోళన, గుండె వేగం పెరగడం, జీర్ణ సమస్యలు వంటి ప్రతికూల ప్రభావాలతో అనుసంధానిస్తారు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Coffee | ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాల్లో కాఫీ ఒకటి. సాధారణంగా కాఫీని నిద్రలేమి, ఆందోళన, గుండె వేగం పెరగడం, జీర్ణ సమస్యలు వంటి ప్రతికూల ప్రభావాలతో అనుసంధానిస్తారు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని రెండు వారాల పాటు నియమితంగా తీసుకుంటే శరీరంపై పలు సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
లివర్ ఆరోగ్యానికి..
కాఫీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నియమితంగా కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. దీని వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే కాఫీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి శరీరంలోని మెటబాలిక్ ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును ఉత్తేజపరుస్తుంది. కాఫీలోని కెఫీన్ అలర్ట్నెస్, దృష్టి, మానసిక పనితీరును పెంచి మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కాఫీ సహాయపడుతుంది. ఇది పెద్దపేగును ఉత్తేజపరచి గట్ మొటిలిటీని పెంచడం ద్వారా జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది.
వీరు మితంగా తీసుకోవాలి..
అయితే కాఫీ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. IBS లాంటి సమస్యలు ఉన్నవారు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పెద్దలకు రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల బ్లాక్ కాఫీ సరిపోతుంది. కానీ గుండె దడ, ఆందోళన, ఆమ్లత్వం లేదా నిద్ర సమస్యలు ఉంటే కాఫీని తగ్గించడం లేదా మానేయడం మంచిది. కాఫీలో అధికంగా చక్కెర లేదా ప్రాసెస్ చేసిన క్రీమ్లను కలపడం ఆరోగ్యానికి హానికరం. వీటిని తగ్గించడం అవసరం. కాఫీ తాగేటప్పుడు కొంత చల్లారిన తర్వాత తేనె కలపడం లేదా స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటి సహజ తీపి పదార్థాలను ఉపయోగించడం మంచిది. సరైన పరిమాణంలో, సరైన విధంగా తీసుకుంటే కాఫీ శరీరానికి పలు ప్రయోజనాలు అందించే పానీయంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Coffee
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

